/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-2-3-jpg.webp)
Vande Bharat Express: విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ రద్దు అయ్యింది. టెక్నికల్ రీజన్స్ తో ఈ రైలును గురువారం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటన చేశారు. ఈ అసౌకర్యానికి ప్రయాణీకులు సహకరించాలని కోరారు. ఆగష్టు 17 ఉదయం 5.45కి ఈ రైలు బయలు దేరాల్సి ఉంది. ఈ రైలు ప్రత్యామ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 7 గంటలకు బయలు దేరింది. ఈ రైలు కేవలం వందే భారత్ స్టాపుల్లో మాత్రమే ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు ఏవైనా అనుమానాలు ఉంటే .. వెంటనే ఆయన రైల్వే స్టేషన్ లలో రైల్వే శాఖ అధికారులను వివరాలను అడిగి తెలుసుకోవాలని సూచించింది విశాఖ రైల్వే శాఖ.
కాగా విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వారంలో ఆరు రోజులు వందే భారత్ రైలు రాక పోకలు సాగిస్తుంది. వందే భారత్ ట్రైన్ ప్రతీ రోజు ఉదయం విశాఖలో బయలు దేరి.. మధ్యాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్ లో బయలు దేరి రాత్రికి విశాఖ పట్నంకు చేరుకుంటుంది. అయితే విశాఖ నుంచి బయలు దేరే వందే భారత్ ను.. టెక్నికల్ రీజన్స్ కారణంగా రద్దు చేశారు.
అయితే వందే భారత్ రద్దు కావడంతో ముందుగా రిజర్వ్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ తాజా నిర్ణయం సమస్యగా మారింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైలు రద్దు విషయాన్ని అధికారులు ఈ రోజు ఉదయం ప్రకటించారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణం చేయాలా? వద్దా? అన్న డైలమాలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. తక్కువ సమయంలో గమ్య స్థానంలో చేరుకొనే అవకాశం ఉండటంతో ప్రయాణీకులు ఈ వందే భారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు చివరి నిమిషంలో రద్దు నిర్ణయం తీసుకున్నారు.
TRAIN CANCELLED ALERT:*
Train No:20833 Visakhapatnam -Secunderabad Vanda Bharat Express is Cancelled today i. e 17.08.2023 Inconvenience is regretted. @RailMinIndia @EastCoastRail @drmvijayawada @drmsecunderabad @SCRailwayIndia pic.twitter.com/wQ7NOeDYG7— DRMWALTAIR (@DRMWaltairECoR) August 17, 2023