Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

ఇకపై రైల్వే రిక్రూట్‌మెంట్‌కు జాబ్‌ క్యాలెంబర్‌ ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గతంలో లాగా కాకుండా ఇకపై ప్రతీఏడాది నాలుగు నోటిఫికేషన్లు ఉంటాయన్నారు. ఇది యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.

New Update
Railway Jobs : ఉద్యోగార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రైల్వే రిక్రూట్‌మెంట్‌పై కీలక ప్రకటన!

RRB :  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB) ఫిబ్రవరి 3న విడుదల చేసిన వార్షిక రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ ఉద్యోగాల కోసం వెతుకుతున్న అభ్యర్థులకు అవకాశాల పరిధిని పెంచుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి కేటగిరీకి సంవత్సరానికి నాలుగు సార్లు జాబ్‌ నోటిఫికేషన్ జారీ చేస్తామని వైష్ణవ్‌ చెబుతున్నారు.

ఏడాదికి నాలుగు సార్లు?
క్యాలెండర్ ప్రకారం, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(Railway Recruitment Board) ప్రతి సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్య అసిస్టెంట్ లోకో పైలట్‌(Assistant Loco Pilot) ల నియామకానికి నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. టెక్నికల్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు ఏప్రిల్‌, మే, జూన్‌లలో సమయం నిర్ణయించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు జూనియర్ ఇంజనీర్లు, పారామెడిక్స్, నాన్ టెక్నికల్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. లెవల్ 1, మంత్రిత్వ శాఖ, ప్రత్యేక కేటగిరీల కోసం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రిక్రూట్‌మెంట్‌ను షెడ్యూల్ చేశారు.

గతంలో మూడు నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్‌ తర్వాత రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించేవారని వైష్ణవ్‌ గుర్తు చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు వయోపరిమితి కారణంగా అవకాశం కోల్పోయేవారన్నారు. ఇకపై అలా ఉండదంటున్నారు రైల్వే మంత్రి. ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ నిర్వహించడానికి క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఇది యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఒక అభ్యర్థి మొదటి ప్రయత్నంలో అర్హత సాధించలేకపోతే రెండో ప్రయత్నంలో చేసుకునేలా ప్రతీ ఏడాది పూర్తి షెడ్యూల్‌తో క్యాలెండర్‌ రిలీజ్ చేస్తామంటున్నారు. అటు ఆర్‌ఆర్‌బీ జనవరి 20న ALP రిక్రూట్‌మెంట్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ మొత్తం 5,696 ఖాళీలను భర్తీ చేయడం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లక్ష్యం. RRB ALP రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19. RRB ALP అప్లికేషన్ దిద్దుబాటు విండో ఫిబ్రవరి 20 నుంచి ఫిబ్రవరి 29, 2024 వరకు ఓపెన్ చేసి ఉంటుంది.

Also Read : రంగంలోకి గులాబీ బాస్‌.. తెలంగాణ భవన్‌లో నేడు కీలక భేటీ!

WATCH:

Advertisment
తాజా కథనాలు