Maharashtra: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు

మహారాష్ట్రలో చిన్నారుల మీద లైంగిక వేధింపులు పాల్పడిన నిందితుడిని ఉరి తీసేంతవరకు ఒప్పుకునేది లేదంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధువులు. ఏడు గంటలుగా బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో పట్టాల మీద బైఠాయించి మరీ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.

Maharashtra: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు
New Update

Rail Roko: ప్రస్తుతం దేశం అంతా భావోద్వేగాలతో నిండి ఉంది. కోలకత్తా రేప్, మర్డర్ కేసు దేశాన్ని పట్టి కుదిపేసింది. దాన్నుంచే ఇంకా జనాలు బయటపడలేదు అంటూ...తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన అందరినీ కదిలిస్తోంది. ముఖ్యంగా బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు అయితే కోపంతో రగిలిపోతున్నారు. చిన్నారులపై ఇలాంటివి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించే వరకు ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపై ఏడు గంటలుగా మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లోని ట్రాక్స్ బైఠాయించారు. రైళ్ళ రాకపోకలను అడ్డుకుంటూ నిరసనలు చేస్తున్నారు.

మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇలా ఎంత మంది వచ్చినా తాము వినిపించుకునేదే లేదంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధువులు. నిందితుడిని కఠినంగా శిక్షించేవరకు కదిలేది లేదని పట్టుబట్టుకుని కూర్చొన్నారు. హ్యంగ్ హ్యాంగ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆరు గంటలకు పైగా కొనసాగుతోన్న రైల్‌ రోకోతో పలు లోకల్‌ రైళ్లు రద్దయ్యాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరసనకారుల డిమాండ్లకనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మంత్రి గిరీశ్ చెప్పారు. అయినా ఆందోళనకారులు నిరసనల్ని విరమించలేదు. మరోవైపు ఈ ఘటనపై మహిళా ఐపీఎస్ నేతృత్వంలో విచారణ చేసేందుకు ఆదేశాలు చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తెలిపారు. ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్‌ అధికారిణి ఆర్తి సింగ్‌ను దర్యాప్తు అధికారిగా నియమించామని చెప్పారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా విచారించాలని, ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలని, విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముందు ఈ అంశాన్ని ఉంచాలనుకుంటున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు.

Also Read : బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్‌ టచ్‌ చేస్తూ.. బాలికల అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు!

#protest #maharshtra #badlapur #rail-stattion
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe