Rahul Ravindran : భారత క్రికెట్ జట్టు కోచ్ రేస్ లో టాలీవుడ్ హీరో.. కానీ?

టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సైతం BCCI హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అప్లికేషన్ ని BCCI రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు.

Rahul Ravindran : భారత క్రికెట్ జట్టు కోచ్ రేస్ లో టాలీవుడ్ హీరో.. కానీ?
New Update

Actor Rahul Ravindran Latest Tweet  : భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో అయన పదవి కలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) హెడ్ కోచ్ పదవికి ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ గూగుల్ ఫార్మ్స్ అందుబాటులో ఉంది. దీంతో కొందరు నెటిజన్స్ సరదాగా BCCI హెడ్ కోచ్ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నారు. వాటి స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సైతం BCCI హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు.

Also Read : ‘జబర్దస్త్’ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం!

ఇదే విషయాన్నీ ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అప్లికేషన్ ని BCCI రిజెక్ట్ చేసినట్లు తెలిపాడు. కాగా ఈ అప్లికేషన్ ఫామ్ నింపడం తనకు ఆనందాన్ని కలిగించినట్లు చెప్పాడు. " మీకు తెలుసా, నేను ఒకసారి టీమ్ ఇండియాకు హెడ్ కోచ్‌ కావాలని అనుకున్నాను, ఏదో ఒక రోజు నా పిల్లలకు చెప్పాలని అనుకున్నాను. కానీ.." అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక రాహుల్ రవీంద్రన్ విషయానికొస్తే.. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తునే మరోవేపు డైరెక్క్షన్ తో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే నేషనల్ క్రష్ రష్మిక మందనతో గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

#rahul-ravindran #actor-rahul-ravindran
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe