Jabardasth Comedian Kevvu Karthik Mother Died : జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం నెలకొంది. అతని తల్లి అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచింది. ఈ క్రమంలోనే కార్తీక్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
జీవితమంతా యుద్ధమే
5 ఏళ్లుగా క్యాన్సరే భయపడే విధంగా దానితో పోరాటం చేశావు. నీ జీవితమంతా ఓ యుద్ధమే. మమ్మల్ని, నాన్నని కంటికి రెప్పలా చూసుకున్నావు. కష్ట పరిస్థితుల్లోనూ కుటుంబాన్ని కాపాడావు. ఈ ఐదేళ్ళలో దేనితోనైనా ఒంటరిగా ఎలా పోరాటం చేయాలో నేర్పించావు. నాలో ధైర్యాన్ని నింపావు. అన్నీ నేర్పావు.కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు" అని ఎమోషనల్ అయ్యాడు.
Also Read : దేవర సాంగ్ వచ్చాక ఆ పాటను మర్చిపోతారు.. ఒక్క ట్వీట్ తో అంచనాలు పెంచేసిన నిర్మాత!
అంతేకాకుండా ఇన్నాళ్లు తన తల్లికి వైద్యం చేసిన డాక్టర్స్ కి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా కెవ్వు కార్తిక్ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆమె తల్లి మరణం పట్ల సానుభూతి తెలుపుతున్నారు. ఇక కార్తీక్ విషయానికి వస్తే.. జబర్దస్త్ లో మొదట కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో టీమ్ లీడర్ గా ఎదిగాడు. టీమ్ లీడర్ అయిన తర్వాత కెవ్వు కార్తీక్ పేరుతో బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. అలాగే పలు సినిమాల్లోనూ కామెడీ రోల్స్ లో అలరించాడు.
View this post on Instagram