Telangana Elections: కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో కులగణన.. రాహుల్ సంచలన ప్రకటన

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. కుల గణన సర్వే చేపడతామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. వరంగల్‌ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

Rahul Gandhi: రాహుల్ యాత్రకు మూడ్రోజులు బ్రేక్
New Update

కుల గణన అనే అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే బిహార్‌ ప్రభుత్వం తమ రాష్ట్రంలో విజవంతంగా కులగణన చేపట్టి వివిధ వర్గాలకు రిజర్వేషన్లను పెంచూతూ అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కులగణన సర్వే ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని అన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన వరంగల్‌ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

Also read: కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

ఎక్కడ కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పాటు అయినా కూడా ఆ రాష్ట్రంలో ప్రతి రూపాయి పేదలకే వెళ్తుందని.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక దళితులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు లాభపడతాయని అనుకున్నామని కానీ అలా జరగలేదని విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కుల గణన చేపట్టి.. ఏఏ కులాలు వెనకబాటుకు గురయ్యాయో తెలుసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని.. బీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి బీజేపీ నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. లోక్‌సభలో ఈ రెండు పార్టీలు కలిసి ఉన్న విషయాన్ని తాను సభలో గమనించాలని.. అన్ని బిల్లులకు బీఆర్ఎస్‌ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపడమే మా లక్ష్యమని.. ఆ తర్వాత ప్రధాని మోదీని గద్దె దింపుతామని పేర్కొన్నారు.

Also Read: బీజేపీ మ్యానిఫెస్టో.. విద్యార్థినులకు ఉచిత లాప్ టాప్ లు, ప్రతి రైతుకు దేశీ ఆవు!

#telangana-elections-2023 #telugu-news #telangana-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe