Rahul gandhi: చోటుతో రాహుల్ గాంధీ సరదా.. ఫన్నీ వీడియో వైరల్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. తాను పెంచుకుంటున్న కుక్కతో కారులో సరదాగా గడిపారు. ఆ శునకంతో నమస్కారం చేయించారు. రాహుల్ ను చూడగానే చోటు అప్యాయంగా దగ్గరికి రావడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

New Update
Rahul gandhi: చోటుతో రాహుల్ గాంధీ సరదా.. ఫన్నీ వీడియో వైరల్!

Rahul gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో వైరల్ అవుతోంది. తాను పెంచుకుంటున్న కుక్కతో కారులో సరదాగా గడిపారు. ఆ శునకంతో నమస్కారం చేయించారు. రాహుల్ ను చూడగానే చోటు అప్యాయంగా దగ్గరికి రావడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

దేశ ప్రజలకు శాపంగా మారాయి..
ఇక లోక్ సభ ఎన్నికల్లో భాగంగా గురువారం కేరళలోని కన్నూర్, పాలక్కాడ్, కొట్టాయంలో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు రాహుల్‌. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీ విధానాలు దేశ ప్రజలకు శాపంగా మారాయని చెప్పారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తాను పోరాటం సాగిస్తున్నానని, అందుకు దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన మీడియా చానళ్లు తనను లక్ష్యంగా చేసుకొని రోజంతా తిట్లదండకం వల్లిస్తున్నాయని అన్నారు. భారతదేశం ఇప్పుడున్నంత అస్తవ్యస్తంగా గతంలో ఎన్నడూ లేదని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. సంపద పంపిణీలో ఇప్పుడున్న అసమానతలు గతంలో లేవని గుర్తుచేశారు. అందుకే రాబోయే తమ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు