Rahul Gandhi Bharat Nyay Yatra: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ్ యాత్ర(Bharat Nyay Yatra) పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. జోడో యాత్రకు (Jodo Yatra) కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు న్యాయ యాత్ర కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనుంది.
ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
ఈ భారత్ న్యాయ యాత్ర 6,700కి.మీ. వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ (Congress Party) వర్గాలు తెలిపాయి. బస్సు, కాలినడకన యాత్ర సాగనుంది. 66 రోజులు 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల మీదుగా యాత్రను చేపట్టనున్నారు రాహుల్. జనవరి 14న మణిపూర్ లో యాత్ర ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని వెల్లడించింది.
ఈ యాత్ర 15 రాష్ట్రాలు.. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలల్లోని 110 జిల్లాల పరిధిలో 6700 కి.మీ.ల దూరం సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అత్యధికంగా యూపీలో 11 రోజుల్లో 20 జిల్లాల మీదుగా యాత్ర కొనసాగనుంది. అస్సాంలో 8 రోజులు 17 జిల్లాల మీదుగా పాదయాత్ర ఉండనుంది. ఈ యాత్ర ద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ లేదని వివరించారు. ప్రజలు పడుతున్న సమస్యలను తెలుకోడానికే ఈ యాత్ర చేస్తున్నామని వెల్లడించారు.