కేరళలోని వయనాడ్ జిల్లాలో వరద ప్రభావంతో కొండచిరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచనలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు 400లకు పైగా మృతి చెందారు. 150 మంది ఆచుకీ తెలియకుండా పోయింది. అయితే ఈ ఘటనపై విపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు.
Also Read: వినేష్ ఫొగాట్‌కు న్యాయం చేయాలి.. పార్లమెంటులో విపక్షాల ఆందోళన
బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడిన ఆయన.. కొండచరియలు విరిగిన ప్రాంతాలను సందర్శించానని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని.. బాధితులల్లో కుటుంబంలో సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటంబాలకు అండగా ఉండాలని.. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. అలాగే వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి.. సమగ్ర పునరావాసాన్ని కల్పించాలన్నారు.
Also Read: వెంటపడి వేధించిన కామాంధులు.. తప్పించుకునేందుకు 140 కి.మీ.లు ప్రయాణించిన బాలికలు!