ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డలో హెలికాప్టర్ ల్యాండింగ్ ఈసీ అనుమతి ఇచ్చింది. ఇటీవల పిల్లర్లు కుంగిపోవడంతో దాన్ని చూసేందుకు రాహుల్ మేడిగడ్డకు వెళ్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
కాగా రాహుల్ గాంధీ గురువారం హెలికాఫ్టర్ లో అంబటిపల్లికి వెళ్లనున్నారు. మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు ఈసీ పర్మిషన్ ఇచ్చింది. ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత అనుమతి ఇచ్చింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈరోజు హెలిపాడ్ స్థల పరిశీలన చేశారు. గురవారం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లను రాహుల్ పరిశీలించున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి అంబటిపల్లి కొత్త గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో రాహుల్ గాంధీ పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను మహిళలకు వివరిస్తారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను శ్రీధర్ బాబు దగ్గర ఉండి చూసుకుంటున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించిన తర్వాత రాహుల్ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఘటన రాజకీయ పరంగా ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడం బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షకోట్ల అవినీతి జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
రాహుల్ గాంధీ మేడిగడ్డ ప్రాంతాన్ని పరిశీలించేందుకు helipad permission