BREAKING: 'భారత్ న్యాయయాత్ర' పేరుతో రాహుల్ పాదయాత్ర

New Update
Rahul: నేటి  నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' షురూ

Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో మరో సారి పాదయాత్ర చేయనున్నారు రాహుల్. జోడో యాత్రకు కొనసాగింపుగా ఈ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు న్యాయ యాత్ర కొనసాగనుంది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయ యాత్ర జరగనుంది. ఈ భారత్ న్యాయ యాత్ర 6,200కి.మీ. వరకు కొనసాగుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బస్సు, కాలినడకన యాత్ర సాగనుంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా యాత్రను చేపట్టనున్నారు రాహుల్. జనవరి 14న మణిపూర్ లో యాత్ర ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని వెల్లడించింది.

ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!

ఈ యాత్ర 14 రాష్ట్రాలు.. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలల్లోని 85 జిల్లాల పరిధిలో 6200 కి.మీ.ల దూరం సాగుతుందని AICC ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. ఈ యాత్ర ద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ లేదని వివరించారు. ప్రజలు పడుతున్న సమస్యలను తెలుకోడానికే ఈ యాత్ర చేస్తున్నామని వెల్లడించారు.

ALSO READ: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. పురుషులకు ప్రత్యేక బస్సులు?

Advertisment
తాజా కథనాలు