పార్లమెంటుకు నేడు రాహుల్ గాంధీ? అందరి దృష్టి స్పీకర్‌పైనే..!!

మోదీ ఇంటి పేరు కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ ను తిరిగి పార్లమెంట్ సభ్యుడిగా వెంటనే చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ కు అవసరమైన డాక్యుమెంట్లన్నీ అందించారు. నేడు రాహుల్ గాంధీ పార్లమెంటులో అడుగుపెడతారా లేదా అన్నది చూడాల్సిందే.

author-image
By Bhoomi
New Update
పార్లమెంటుకు నేడు రాహుల్ గాంధీ? అందరి దృష్టి స్పీకర్‌పైనే..!!

Will Rahul Gandhi return to Parliament today?

మోదీ ఇంటిపేరు కేసులో (Modi Surname Case) రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన అనంతరం ఆయన పార్లమెంటు సభ్యత్వ పునరుద్ధరణ గురించి ఇప్పుడు చర్చ షురూ అయ్యింది. ఇండియా కూటమిగా ప్రతిపక్షాలు ఏకమవ్వడం, మణిపూర్ (Manipur Violence) అల్లర్లపై మోదీని పార్లమెంటులో మాట్లాడించాని సంకల్పించి అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టడం..దీనిపై ఈ వారంలో చర్చ జరిగే అవకాశం ఉండటం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ఉండాలని ప్రతిపక్షాలన్నీ భావిస్తున్నాయి. సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారించడంపై స్టే విధించిన వెంటనే కాంగ్రెస్ ఆయన్ను తిరిగి పార్లమెంటుకు తిసుకురావడానికి అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.

అయితే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుపెట్టే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలోని (congress Party) పలువురు నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేలు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రతులను స్పీకర్ కు అందజేశారు. ఆయనపై వేసిన అనర్హత వేటును రద్దు చేసేందుకు కావాల్సిన పత్రాలను కూడా సిద్దం చేసి స్పీకర్ ముందు ఉంచారు. ఇక దీనిపై సంతకమే తరువాయి.

ఒక వేళ సంతకం చేస్తే రాహుల్ గాంధీ పార్లమెంటులోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే సోమవారం సంతకం చేస్తారా లేదా ఇంకా సమయం తీసుకుంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్ పై ఎంతవేగంగా అనర్హత వేటు వేశారో అంతే వేగంతో రద్దు చేస్తూ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలా చేయనట్లయితే మళ్లీ కోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అటు ఇండియా కూటమి కూడా ఇదే విషయాన్ని లోకసభలో లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. ఒక కేసులో పదేళ్ల జైలు శిక్ష పడటంతో లక్షద్వీప్ ఎంపీ ఫైజల్ పై కూడా 2022 జనవరిలో లోకసభ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ శిక్షపై కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు స్టే విధించింది. అయినా కూడా లోకసభ మాత్రం అనర్హత వేటు రద్దు చేయలేదు. మరోసారి పైజల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. గతేడాది మార్చిలో విచారణ చేపట్టాల్సింది.

కానీ అంతకుముందే ఆయనపై అనర్హత వేటును తొలగిస్తూ లోకసభ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియను గమనిస్తే...నెల రోజుల వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ విషయంలో అంత సమయం పట్టే అవకాశం ఉండదంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి. సోమవారం దీనిపై సానుకూల నిర్ణయం రానట్లయితే మళ్లీ కాంగ్రెస్ నేతలు సుప్రీంను ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మోదీ పేరుపై వ్యాఖ్యానించినందుకు సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Also Read: జాబిల్లిని తన కెమెరాలో బంధించిన చంద్రయాన్ -3, వీడియోను షేర్ చేసిన ఇస్రో..!!

Advertisment
తాజా కథనాలు