Shoes Got huge Demand: సుల్తాన్ పూర్‌లో రామ్ చేత్ అనే వ్యక్తి రోడ్డు పక్కన చెప్పులు కుట్టునే వ్యక్తి. కానీ అతు ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. దానికి కారణం అతని దుకాణానికి ఆంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ వెళ్ళడే. అక్కడకు వెళ్ళి అతనితో మాట్లాడ్డమే కాదు..రామ్ దుకాణంలో కూర్చుని చాలాసేపు మాట్లాడారు. అక్కడ కూర్చుని చెప్పులు కుట్టారు. దీంతో రామ్ చేత్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి అటువైపుగా వెళ్తున్న వారంతా కారు ఆపి మరీ, ఆయన యోగక్షేమాలు అడుగుతున్నారు. సెల్ఫీలు దిగుతూ..వాటిని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు ఆరోజు రాహుల్ కుట్టిన షూస్ కి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. రాహుల్ దుకాణం వదిలి వెళ్ళిన వెంటనే రామ్ చేత్‌కు కాల్ వచ్చింది. అందులో ఆయన కుట్టిన షూస్ కాఆలంటూ ఓ వ్యక్త అడిగారుట. దానిని తనకు రూ.5 లక్షలకు అమ్మాల్సిందిగా అడిగారుట కూడా. ఇంకొకరు అయితే ఏకంగా రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారట. మరొకరైతే.. ‘బ్యాగు నిండా డబ్బిస్తా.. ఇచ్చేయ్’ అన్నారట. కానీ ఎవ్వరు ఎంత ఇస్తామని చెప్పినా..ఎలా అడిగిఆ కూడా రామ్ చేత్ మాత్రం వాటిని ఇవ్వను అని చెబుతున్నారుట. రాహుల్‌కి గుర్తుగా తన వద్దే ఉంచుకుంటానని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రాహుల్‌తో దిగిన ఫొటో వార్తాపత్రికల్లో వచ్చినప్పటి నుంచి అధికారులు కూడా అలెర్ట్ అయిపోయారు. ఏమైనా సమస్యలుంటే చెప్పాలని స్థానిక అధికారులు వచ్చి అడుగుతున్నారు. రాహుల్ ఆదేశాల మేరకు.. ఆ తర్వాతి రోజునే పార్టీ నేతలు రూ.10 లక్షల విలువైన చెప్పులు కుట్టే మిషన్‌ను ఆయనకు అందజేశారు. అయితే, తన ఇంటికి కరెంట్ సదుపాయం లేకపోవడంతో, కుమారుడి ఇంటి వద్ద పెట్టి చెప్పులు కుడుతున్నానని రామ్ చేత్ చెప్పుకొచ్చారు.