కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.. రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్‌ విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 6 గ్యారంటీలను చట్టంలాగే అమలు చేస్తామన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.. రాహుల్ గాంధీ
New Update

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ దూకుడు పెంచారు. వరుస సమావేశాలు, సభల్లో పాల్గొంటూ తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. అందులో భాగంగా నేడు తెలంగాణలో 4 నియోజకవర్గాలు ఆందోల్‌, సంగారెడ్డి, కామారెడ్డిలో ప్రచారం నిర్వహించనుండగా.. మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్‌ విజయభేరి సభలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఈ మేరకు కేసీఆర్ కు బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని, ఒకరికొకరికి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ ఎలాంటి కేసులు పెట్టదు. లోక్ సభలో బీజేపీకి కేసీఆర్ సపోర్టు చేస్తే రాష్ట్రంలో కేసీఆర్ కు బీజేపీ అండగా ఉంటోంది. అందుకే మా లక్ష్యం తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడగొట్టడమే. రెండో లక్ష్యం రేపు తెలంగాణలో గెలిచిన తర్వాత మోడీని ఓడగొడదాం. ఎవరినీ వదిలిపెట్టకూడదు. ఈ రెండు పువ్వుల మధ్య రహస్య ఒప్పందం ఉంది. నరేంద్రమోడీ ఉన్నాడని కేసీఆర్ అనుకుంటే మోడీ ఉన్నాడని మోడీ అనుకుంటున్నారు. వాళ్లిద్దరు కలిసి దొరల సర్కార్ ఏర్పాటు చేస్తే.. మనం ప్రజల సర్కార్ ఏర్పాటు చేస్తాం. అక్కడ అదానీ, మోడీ దేశాన్ని పరిపాలిస్తే.. రాష్ట్రాన్ని కేసీఆర్ గుప్పిట్లో పెట్టకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరికి అండగా మూడో పార్టీ ఎంఐఎమ్ ఉంది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందో అక్కడ ఎంఐఎమ్ క్యాండెట్ ఉంటారు. అస్సాంలో పట్టు లేకపోయినా నిలబడ్డారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తారో వాళ్లకు బిజేపీ మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహాలతో ఆ ముగ్గురిని చిత్తు చేసి గెలుస్తుందన్నారు. అలాగే నరేంద్ర మోడీ దేశంలో విద్వేశాన్ని రెచ్చగొడుతున్నారని, ఈ దేశం విలువ తగ్గిస్తున్నారని మండిపడ్డారు. అందుకే తమ పార్టీ విద్వేశాల బజారులో భారత్ జోడో యాత్రతో ప్రేమ అనే బొట్టు పెట్టిందని రాహుల్ గాంధీ అన్నారు.

Also read :జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు

ఇక మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్ ముగియగానే 2.30 గంటలకు సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్ కు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి నేతలతో మాట్లాడి ఎన్నికల పరిస్థితులపై చర్చించి.. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. కాగా రాహుల్ పర్యటన నేపథ్యంలో నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కూడా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వరంగల్ వెస్ట్ కాజీపేట చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 3.30 గంటలకు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్‌లో ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఇంకా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య ఈ సాయంత్రం 3 గంటలకు మక్తల్‌లో ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 5.30 గంటలకు ముషీరాబాద్‌లో ప్రచార సభలో మాట్లాడతారు.

#telangana #rahul-gandhi #andol-sabha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe