Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర

తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. బాగా ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం బస్సు యాత్రలు చేసేందుకు రెడీ అయింది. బస్సు యాత్రను కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మొదలుపెట్టనున్నారు. మూడురోజుల పాటూ 8 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సాగుతుంది.

Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర
New Update

Congress Bus Yatra in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర ఈరోజే మొదలవనుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) కలిసి బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అన్నాచెల్లెళ్ళు మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్‌లో రామప్ప ఆలయానికి చేరుకుంటారు. టెంపుల్‌లో రాహుల్, ప్రియాంక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రామప్ప గడి (Ramappa Temple) నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలవుతుంది. అక్కడ ఇనుంచి ములుగు (Mulugu) జిల్లాకు వెళతారు. అక్కడ బహిరంగసభలో మహిళలతో రాహుల్, ప్రియాంకలు భేటీ అవుతారు.

Also Read:గాజా ఆసుపత్రిలో పేలిన బాంబు, 500మంది మృతి

ములుగు సభ తర్వాత ప్రియాంక గాంధీ తరిగి ఢిల్లీ వెళ్ళిపోతారు. రాహుల్ మాత్రం బస్సులో భూపాలపల్లికి వెళతారు. అక్కడ నిరుద్యోగ యువతతో రాహుల్ ర్యాలీ నిర్వహిస్తారు. రాత్రికి భూపాలపల్లిలోనే ఉంటారు. ఇక 19వ తేదీన భూపాలపల్లి నుంచి కాటారం, అక్కడ నుంచి మంథని, పెద్దపల్లిచ కరీంనగర్ లు వెళతారు. 20వ తేదీన బోధన్ ఆర్మూర్, నిజామాబాద్‌లలో కాంగ్రెస్ బస్సు యాత్ర కొనసాగుతుంది. బోధన్ చెరుకు ఫ్యాక్టరీ, ఆర్మూర్‌లో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ గాంధీ ప్రత్యేక సమావేశం అవనున్నారు. నిజామాబాద్‌లో పాదయాత్రలో పాల్గొంటారు. దీంతో కాంగ్రెస్ మూడు రోజలు బస్సు యాత్ర మొదటి విడత పూర్తవనుంది.

ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నిన్న మ్యానిఫెస్టో (BRS manifesto), హామీలను ప్రకటించింది. బీఆర్ఎస్ హామీలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతోందాని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలంటే ఇక్కడి ప్రజల మనసును గెలుచుకోవాలి. ఇప్పటివరకు మ్యానిఫెస్టోను ప్రకటించని కాంగ్రెస్ ఈ మూడు రోజుల బస్సు యాత్రలో మ్యానిఫెస్టోతో పాటూ హామీలను కూడా ప్రకటిస్తుందని అనుకుంటున్నారు.

Also Read:మొన్న ఇంగ్లండ్, నిన్న సౌత్ ఆఫ్రికా…పసికూనలు అదరగొడుతున్నాయి.

#telangana-election-2023 #congress-bus-yatra-in-telangana #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe