Rahul Gandhi: ఉపాధి హమీ కూలీలు, కౌలు రైతులకు రాహుల్ ఆఫర్.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగిపోతుందని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. By B Aravind 31 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి కొల్లాపూర్‌లో ఏర్పాటుచేసిన పాలమూరు ప్రజా భేరి సభలో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే ఇందిరమ్మ రాజ్యా రావాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అన్నారు. కాంగ్రెస్ వస్తే.. రైతు బంధు ఆగిపోతుందని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కౌలురైతులతో పాటు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే ఉపాధీ హామీ కూలీలకు కూడా రూ.12 వేల ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. Also Read: జాగ్రత్త.. ఇకపై వీడియో రూపంలో ట్రాఫిక్ చలాన్లు.. ఢిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నప్పటికీ కూడా ప్రియాంక అనారోగ్యం కారణంగా నేను ఈ పర్యటనకు వచ్చానని తెలిపారు. మనది రాజకీయ అనుబంధం కాదని.. కుటుంబ అనుబంధమని తెలిపారు. కొల్లాపూర్ సభకు తప్పక వస్తానని ప్రియాంక గాంధీ హమీ ఇచ్చారన్నారు. టికెట్లకు సంబంధించి ఢిల్లీలో సీఈసీ భేటీ ఉన్నా కూడా ఈ సభకు హాజరయ్యానని పేర్కొన్నారు. ఓవైపు ముఖ్యమంత్రి కుటుంబం, మరోవైపు నిరుద్యోగులు, మహిళలు ఉన్నారని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని.. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. #telugu-news #rahul-gandhi #telangana-elections-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి