Rahul Gandhi: స్వర్ణ దేవాలంయలో గిన్నెలు కడిగిన రాహుల్‌ గాంధీ!

కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) సోమవారం పంజాబ్‌ (Punjab) లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden temple) సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పార్థనలు చేశారు.అంతే కాకుండా ఆయన ఆలయంలో సేవా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. భక్తులు తిన్న అల్పాహారం గిన్నెలను కూడా ఆయన శుభ్రపరిచారు.

New Update
Rahul Gandhi: స్వర్ణ దేవాలంయలో గిన్నెలు కడిగిన రాహుల్‌ గాంధీ!

Rahul Gandhi offers 'Sewa' at Golden Temple: కాంగ్రెస్ (Congress) పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) సోమవారం పంజాబ్‌ (Punjab) లోని స్వర్ణ దేవాలయాన్ని (Golden temple) సందర్శించారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పార్థనలు చేశారు.అంతే కాకుండా ఆయన ఆలయంలో సేవా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. భక్తులు తిన్న అల్పాహారం గిన్నెలను కూడా ఆయన శుభ్రపరిచారు.

రాహుల్‌ గాంధీ సోమవారం రాత్రి కూడా అమృత్‌ సర్‌ లోనే ఉండనున్నారు. రాహుల్ కేవలం ఆధ్మాత్మిక పర్యటనలో భాగంగానే అమృత్‌ సర్‌కి వచ్చారని, ఇందులో రాజకీయ యాత్ర ఏమి లేదని పంజాబ్‌ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆయన ఆథ్యాత్మిక పర్యటనకు ఎవరూ కూడా ఇబ్బంది కలిగించ వద్దని కాంగ్రెస్ నేతలు అభిమానులను కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ పంజాబ్ శాఖ అధ్యక్షుడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యకర్తలను కోరారు. ఇదిలా ఉండగా..పంజాబ్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, ఆప్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సమయంలోనే రాహుల్‌ గాంధీ అమృత్‌ సర్ పర్యటన ప్రాధాన్యత చోటు చేసుకుంది.

గత వారం కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్ ఖైరాను మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్‌, మనీ లాండరింగ్‌ లో ప్రమేయం ఉందనే ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) కు రక్తదాహం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తనను ముఖ్యమంత్రి మాన్‌ హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఖైరా గతంలో కూడా అనేక సార్ఉ ఆరోపించిన విషయం తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం రాహుల్‌ రైల్వే కూలీగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల విషయంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన రైల్వే కూలీగా మారి సూట్‌ కేసులు మోశారు. ఆయన రైల్వే కూలీ చొక్కా వేసుకున్నారు. అనంతరం వారి బ్యాడ్జీని కూడా కట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఫర్నీచర్‌ మార్కెట్‌ కి వెళ్లి కార్పెంటర్ గా కూడా మారారు. అక్కడ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు