కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈ చిక్కులు రాజకీయంగా కాదు...ఆయన తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) కి ఇచ్చిన కుక్క పిల్ల వల్ల. ఆయన కొద్ది రోజుల క్రితం గోవా(Goa) కి వెళ్లారు. అక్కడికి ఒంటరిగా వెళ్లిన ఆయన జంటగా తిరిగి వచ్చారు. అక్కడ నుంచి ఆయన ఓ కుక్క పిల్లని తీసుకుని వచ్చి ప్రపంచ జంతు దినోత్సవం రోజున తల్లికి బహుమతిగా ఇచ్చారు.
దానికి సోనియా ఎంతో సంతోషించారు. ఆమె దానికి నూరీ అని పేరు కూడా పెట్టారు. ఆ ఫోటోలన్నింటిని కూడా రాహుల్ తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో..అవి కాస్త వైరల్ అయ్యాయి. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ కుక్క పిల్ల పేరు రాహుల్ కి తంటాలు తెచ్చిపెట్టింది.
Also read:భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం..ఖగోళం బద్ధలవుతుందా?…నాసా ఏం చెబుతోంది..?
దీని గురించి అసదుద్దీన్ ఒవైసీ పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కుక్క పిల్లకి నూరీ అని పేరు పెట్టడం అంటే..ఇస్లాం మతాన్ని అవమానించినట్లే అని అంటున్నారు. ఇది మహిళలను అవమానించినట్లే అని ఆ పార్టీ పేర్కొంది. ఏఐఎంఐఎం అధికార ప్రతినిధి మహ్మద్ ఫర్హాన్ స్పందించారు. కుక్కకు నూరీ అని పేరు పెట్టడం అంటే ఇస్లాం మతానికి చెందిన లక్షలాది మంది బాలికలను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు.
రాహుల్ తన తల్లికి బహుమతిగా ఇచ్చిన ఈ కుక్కపిల్ల జాక్ రస్సెల్ జాతికి చెందినది. రాహుల్ తన గోవా ట్రిప్పులో ఉన్నప్పుడు షర్వాణి పిత్రే అనే ఆమె తన భర్తతో కలిసి నడుపుతున్న కుక్కల కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఆ సమయంలో ఆయన నూరీ అనే కుక్క పిల్లను తీసుకుని ప్రత్యేకంగా తల్లికి బహుమతిగా ఇచ్చారు. అతనికి కుక్కపిల్లలంటే చాలా ఇష్టం. పాపి నూరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.