Sultanpur Court : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం ఉదయం సుల్తాన్‌పూర్ కోర్టుకు(Sultanpur Court) హాజరుకానున్నారు. అందుకుగానూ భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra) ఈరోజు ఉదయం ఆగనుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి అమేథీలోని ఫుర్సత్‌గంజ్ నుంచి ప్రారంభం కానున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.
2018 లో బెంగళూరు(Bangalore) లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ(BJP) నాయకుడు విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఓ హత్య కేసులో అమిత్ షా హయాంలో బీజేపీ ప్రమేయం ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
2005 లో జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ కేసులో అమిత్ షా ను ముంబైలోని ప్రత్యేక సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించినట్లు బీజేపీ నేత మిశ్రా వివరించారు. అయినప్పటికీ కూడా రాహుల్ మాత్రం అమిత్ షాను హంతకుడు అని ఆరోపించారు. 33 సంవత్సరాలుగా పార్టీ కోసం రేయిబంవళ్లు కష్టపడుతున్న నేను ఇలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు చాలా బాధపడినట్లు మిశ్రా పేర్కొన్నారు.
దీంతో ఈ విషయం గురించి నా లాయర్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆగస్టు 4 , 2018 లో సుల్తాన్‌పూర్ లోని జిల్లా సెషన్స్ ఎంపీ/ఎంఎల్‌ఏ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు వివరించారు. విజయ్ మిశ్రా తరఫు న్యాయవాది మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కోర్టు దోషిగా నిరూపిస్తే గరిష్టంగా రెండేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.
Also Read : రూ. 13 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు శంకుస్థాపన చేయనున్న మోదీ!