Rahul Dravid : విశ్వవిజేతలకు గురువుగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మిస్టర్ వాల్

ఆటగాడిగా నేరవేర్చుకోలేకపోయిన కలను కోచ్‌గా తీర్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా పైకెత్తి విజయగర్జన చేశాడు. తన మొత్తం కెరీర్‌లో ఇలాంటి రోజు కోసం ఎదురు చూసిన మిస్టర్ వాల్ అపూర్వ విజయంతో తన కోచ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు.

Rahul Dravid: నాకు ఉద్యోగం లేదు.. మీ దగ్గర ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
New Update

T20 World Cup 2024 : ప్రపంచకప్ ప్రతీ క్రికెటర్ (Cricketer) కల. మొత్తం కెరీర్‌లో ఒక్కసారి అయినా కప్‌ను ముద్దాడాలని అనుకుంటారు. ఎంత గొప్ప ఆటగాడు అయినా..రికార్డ్‌లు ఎన్ని సాధించినా..ఎన్ని రన్స్ చేసినా...రాని తృప్తి ఒక్కసారి వరల్డ్‌కప్‌ ఎత్తుతుంటే వస్తుంది. అలాంటి కలను ది గ్రేట్ వాల్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) మిస్ అయ్యాడు. తన మొత్తం కెరీర్‌లో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ద్రావిడ్ ప్రపంచకప్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. తన ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత రాహుల్ తిరిగి టీమ్ ఇండియా (Team India) కు కోచ్ అయ్యాడు.టీమిండియా హెడ్ కోచ్‌గా 2021లో రాహుల్ ద్రావిడ్ అపాయింట్ అయ్యారు. ఆ ఏడాది యుఏఈ వేదికగా సాగిన టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ద్రావిడ్.. ఛార్జ్ తీసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌తో కోచ్‌గా బోణీ కొట్టారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా జట్టును రాటుదేల్చారు.

ద్రావిడ్ పర్యవేక్షణలోనే గత ఏడాది జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌లో ఫైనల్స్ వరకూ వెళ్లగలిగింది టీమిండియా. దాన్ని విజయంగా మలచుకోవడంలో విఫలమైంది. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది. అప్పుడూ కూడా రాహుల్ ద్రావిడ్ కల నెరవేరలేదు.

రాహుల్ ద్రావిడ్‌కు కోచ్‌గా కూడా టీ20 వరల్డ్‌కప్పే చివరి టోర్నీ. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాతనే రిటైర్ మెంట్ ప్రకటించాడు రాహుల్. కానీ బీసీసీఐ (BCCI) అందుకు ఒప్పుకోలేదు. టీ 20 ప్రపంచకప‌ వరకు ఉడాల్సిందే అంది. దానికి ద్రావిడ్ బలవంతంగానే ఒప్పుకున్నాడు. చివరకు కప్పును అందుకున్నాడు. ఒక్కమ్యాచ్‌ను కూడా ఓడిపోకుండా భారత జట్టు ప్రపంచకప్‌ను గెలిచి కోచ్ చేతిలో పెట్టంది.

రోహిత్ కప్పు అందుకోవడం...టీమ్ సంబరాలు చేసుకోవడం అయ్యాక విరాట్‌ కోహ్లీ (Virat Kohli)... టీ 20 ప్రపంచకప్‌ను హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు అందించాడు. ఆటగాళ్లంతు చుట్టూ చేరి చూస్తుండగా రాహుల్‌ ద్రావిడ్‌ కప్పు పైకెత్తి విజయ గర్జన చేశాడు. దీనికోసమే కదా ఇన్నేళ్లు శ్రమపడ్డది అనేలా టీమిండియా హెడ్‌ కోచ్‌ ఆ క్షణాలను భావోద్వేగంతో ఆస్వాదించాడు. గట్టిగా అరుస్తూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. దీని కోసమే కదా ఇన్నాళ్ళు నిరీక్షించాను అన్న ఎమోషన్ అతనిలో అప్పుడు కనిపించింది. ఆ తర్వాత టీమ్ ఆటగాళ్ళు అంతా కోచ్ ద్రావిడ్‌ను గాల్లోకి ఎగురేస్తూ తమ కృతజ్ఞతను తెలియజేశారు. కోచ్‌గా అతనికివ్వాల్సిన గౌరవాన్ని ఆనందంగా చాటుకున్నారు.

మిస్టర్ వాల్...

పైన చెప్పినదంతా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ కెరీర్. కానీ అంతకు ముందు క్రికెటర్‌గా అతనికో ప్రత్యేకమైన స్థానం ఎప్పుడూ ఉంటుంది. ఒక 20 ఏళ్ళు ఇండియన్ క్రికెటర్‌కు వాల్‌గా నిలబడ్డాడు ఈ మిస్టర్ డిపెండబుల్. ఆ త్రయం లేకపోతే ఇండియన్ టీమ్ లేదు అన్నంతగా సచిన్, గంగూలీలతో కలిపి ఎన్న విజయాలను అందించాడు. రాహుల్ ద్రవిడ్ జట్టులో ఆటగాడిగా ఉన్న రోజుల్లో అతడు చేసిన కృషి, పడ్డ కష్టం అతడికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. అతడు వికెట్ తేలిగ్గా ఇచ్చేవాడు కాదు.ద్రవిడ్ తన వికెట్‌ను పారేసుకోవడం అనేది చాలా అరుదు. ఆ ప్రతిభే ద్రవిడ్‌ను ‘ద వాల్’ అని, ‘మిస్టర్ డిపెండబుల్’ అని పిలుచుకునేలా చేసింది.

2001 మార్చిలో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో దాదాపు ఆస్ట్రేలియాదే విజయం అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్(180 పరుగులు), వీవీఎస్ లక్ష్మణ్‌(281 పరుగులు)తో కలిసి అత్యధికంగా 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి, ఆ ఫలితాన్నే తిరగరాయడంలో కీలక పాత్ర పోషించాడు.2004లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 12 గంటలపాటు సుదీర్ఘంగా ఆడిన ఇన్నింగ్స్‌ను, ఆటగాళ్ల మొక్కవోని దీక్ష, పట్టుదలకు ఒక ఉదాహరణగా చెప్తారు.2011లో ఇంగ్లండ్ టూర్‌లో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ ద్రవిడ్ మాత్రం తన చక్కటి ప్రదర్శనతో మెరిశాడు. 4-0 తేడాతో జట్టు ఓటమిని ఎదుర్కొన్నా, ఈ టూర్‌లో 602 పరుగులు సాధించాడు. తన ఆటలోని మార్క్‌, పట్టుదల, ఓటమిని ఒప్పుకోని స్వభావమే కోచ్‌గా ఉన్నప్పుడు కూడా చూపించాడు. అదే ఇప్పటి భారత జట్టును ప్రపంచంలోనే తిరుగులేని జట్టుగా నిలబెట్టింది. విశ్వవిజేతను చేసింది.

11 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు రాహుల్ ద్రావిడ్. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ (భారత్), బ్రియాన్ లారా (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)ల తర్వాత ద్రావిడ్ చేరాడు. 16 ఏళ్లపాటు ఆటగాడిగా టీమిండియాకు ఎనలేని సేవలు చేశాడు. టీమిండియాకు కెప్టన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ క్రమంలో 164 టెస్టులు, 344 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడి 24 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 46 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. ఎలాంటి సమయంలోనైనా వికెట్లకు అడ్డుగోడగా నిలబడి టీమిండియాను అనేక మ్యాచ్‌ల్లో గెలిపించాడు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రికెటర్ హవా నడుస్తున్న రోజుల్లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Also Read:విరాట్ బాటలోనే రోహిత్..టీ20లకు రిటైర్మెంట్

#rahul-dravid #team-india #coach #mister-wall
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe