Cricket:హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు

New Update
Cricket:హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు

వరల్డ్ కప్ తో భారత జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ రెండేళ్ళ పదవీ కాలం ముగిసిపోయింది. టీమ్ ఇండియా ప్రపంచకప్ లో ఓడిపోవడంతో రాహుల్ ఇంటికి వెళ్ళిపోవడం కాయం అనుకున్నారు. అతను కూడా నేను ఇంక కోచ్ గా చేయను అని చెప్పేశాడు. అయితే బీసీసీఐ మాత్రం రాహుల్‌ని వదల్లేదు. మరికొన్నాళ్ళు కోచ్‌గా ఉండమని అడిగింది. అయినా ససేమిరా అన్నాడు. దీని మీద చాలా చర్చలు, డిస్కషన్లు నడిచాయి. రాహుల్ కాకపోతే వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ అవుతాడని కూడా అన్నారు. అయితే వీటన్నింటికీ తెర దించుతూ మరికొన్నాళ్ళు రాహుల్ ద్రావిడే టీమ్ ఇండియా కోచ్ అని ప్రకటించింది బీసీసీఐ.

Also Read:లుఫ్తాన్సా విమానంలో భార్యాభర్తల గొడవ..ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

రాహుల్ ద్రావిడ్ మరికొంత సమయం కోచ్ గా ఉండడానికి అంగీకరించాడని బీసీసీఐ అధికారికంగా తెలిపింది. రాహుల్‌తోపాటు ఇప్పటికే ఉన్న సహాయక సిబ్బంది పదవీకాలాన్ని కూడా బీసీసీఐ పొడిగించింది. దీని ప్రకారం బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్ దిలీప్‌కు పొడిగింపు లభించినట్లైంది. అయితే, వీరు ఎప్పటి వరకు ఈ పదవిలో ఉంటారనేది మాత్రం బీసీసీఐ చెప్పలేదు. కానీ వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ వరకూ మాత్రం కచ్చితంగా రాహుల్ కోచ్ గా ఉంటాడని తెలుస్తోంది.

కోచ్‌గా కొనసాగడం మీద రాహుల్ ద్రావిడ్ కూడా స్పందించాడు.భారత టీమ్ తో రెండేళ్ళ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు ద్రావిడ్. ఎన్నో ఎత్తులు పల్లాలను చూశామని చెప్పాడు. మేనేజ్‌మెంట్‌తోపాటు జట్టు నుంచి ఎంతో సహకారం లభించింది. జట్టులో అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు. అందరమూ సరైన దారిలోనే వెళుతున్నాం. గెలుపోటములు ఆటలో భాగమే. ఓడిపోయినంత మాత్రాన అన్నీ పోయినట్టు కాదు అని చెప్పుకొచ్చాడు. నాపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు. నా విజన్‌ పట్ల విశ్వాసంతో మద్దతుగా నిలిచింది. జట్టు కోసం కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. నా కోసం కుటుంబ సభ్యులు చాలా త్యాగాలు చేశారు. వారి మద్దతును ఎప్పుడూ మరిచిపోలేనని ద్రావిడ్ చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు