Rahul Dravid: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్!

2028 ఒలింపిక్స్‌ లో క్రికెట్ భాగం కావాలని బలంగా కోరుకుంటున్నట్లు రాహుల్ ద్రావిడ్ చెప్పారు. పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటికే భారత డ్రెస్సింగ్ రూమ్ లో చర్చ మొదలైందంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

New Update
Rahul Dravid: 2028 ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ ఎంట్రీ.. పతకం కోసం సిద్ధంగా ఉన్నామన్న ద్రావిడ్!

2028 Olympics: 2028 ఒలింపిక్స్‌ లోకి క్రికెట్ ఎంట్రీపై టీమ్‌ ఇండియా క్రికెట్ మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీనిపై డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇప్పటికే సీరియస్‌గా చర్చ నడుస్తోందని, ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ మేరకు పారిస్‌ ఒలింపిక్స్‌ చూసేందుకు వెళ్లిన ద్రావిడ్‌ మీడియాతో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

ఒలింపిక్స్‌లో ఎంట్రీపై డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చ..
2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఎంట్రీపై డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చించడం విన్నా. 2026 టీ20 ప్రపంచకప్‌, 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌ మాదిరిగానే 2028 ఒలింపిక్స్‌ గురించి ఆటగాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఈ విశ్వ క్రీడల్లో తాము భాగం కావాలని, పోడియంపై నిలబడి పతకం అందుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం సన్నద్ధత మొదలుపెట్టారని చెప్పారు. ఇక ఈ మెగా సంబరంలో క్రికెట్‌ టోర్నీ ప్రారంభమయ్యాక.. భారత మహిళా, పురుషుల జట్లు కచ్చితంగా స్వర్ణం గెలుస్తాయని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. చివరగా ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం ప్రస్తుతానికి తనకైతే లేదని, ఏదోఒకరకంగా లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో భాగమయ్యేందుకు ప్రయత్నిస్తానన్నారు. జట్టుతో కలిసి కుదరకపోతే కనీసం మీడియా జాబ్‌ అయినా చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Film Producers: సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. ఆ నటీనటులపై చర్యలకు సిద్ధం!

పారిస్ ఒలింపిక్స్‌ లో భారత్‌ తరఫున పాల్గొనే క్రీడాకారుల కోసం లా విల్లెట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘ఇండియా హౌస్‌ (India House)’ను ద్రవిడ్‌ సందర్శించారు. అథ్లెట్లకు అందుతున్న సౌకర్యాలను తెలుసుకుని ఆటగాళ్లు, సిబ్బందితో ముచ్చటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు