/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rahul-at-Raebareli-jpg.webp)
హమ్మయ్య.. ఎట్టకేలకు రాహుల్ గాంధీ చివరి క్షణాల్లో రాయ్‌బరేలీ(Rahul at Raebareli) నుంచి తన నామినేషన్ వేశారు. జాతీయస్థాయిలో అతి పెద్ద పార్టీ.. దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన పార్టీ.. భారత స్వాతంత్రోద్యమ ఫలాల్ని తమ కారణంగా వచ్చాయి అని చెప్పుకునే పార్టీ.. ఆ పార్టీకి వారసులుగా ప్రచారం చేసుకుంటూ.. రాజకీయాల్లో కొనసాగుతున్నవారు ఈ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకోవడానికి చివరి క్షణాల వరకూ సమయం తీసుకున్నారు. అవును.. కాంగ్రెస్ పార్టీ వారసుడిగా.. ప్రధాని పదవికి పోటీదారుగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయాలనేది తేల్చుకోవడానికి ఎంతో తర్జన, భర్జన జరిగింది. దశాబ్దాలుగా రెండు నియోజకవర్గాల్లో తమదైన వారసత్వ పట్టును కొనసాగిస్తూ వస్తున్నా అమేధీ, రాయ్‌బరేలీ(Rahul at Raebareli) నియోజకవర్గాల్లో నామినేషన్ చివరి రోజున అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అమేథీ నుంచి గాంధీ కుటుంబ స్నేహితుడు కిషోరీ లాల్ శర్మ పోటీ చేస్తున్నారు. ఇక రాయ్‌బరేలీ(Rahul at Raebareli) నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూసినప్పటికీ.. వారికి షాక్ ఇస్తూ ప్రియాంక గాంధీ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. తమదైన అమేథీ నుంచి గాంధీ కుటుంబసభ్యులు పోటీ చేయకపోవడం కాంగ్రెస్ అభిమానులను కలవర పెడుతోంది. యూపీ కాంగ్రెస్ కేడర్ మొదటి నుంచి రెండు నియోజకవర్గాల నుంచి గాంధీ తోబుట్టువులు ఇద్దరినీ బరిలో ఉండాలని కోరుతూ వస్తోంది. అయితే, అమేథీ నుంచి పోటీకి ఇరువురూ వెనకడుగు వేయడంతో అక్కడ స్మృతి ఇరానీ గెలుపు నల్లేరుపై నడకలా కావచ్చని కాంగ్రెస్ అభిమానులు భయపడుతున్నారు.
ఇదిలా ఉంతే.. అసలు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ(Rahul at Raebareli) నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే ప్రశ్న గట్టిగ అందరిలోనూ తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు సమాధానంగా అనేక కారణాలు కనిపిస్తాయి. అమేథీతో పోలిస్తే రాయ్ బరేలీ రాహుల్ గాంధీకి సేఫ్ నియోజకవర్గంగా విశ్లేషిస్తున్నారు. స్థానిక అభిప్రాయం, ప్రైవేట్ సంస్థల సర్వే ఆధారంగా రాహుల్ గాంధీ రాయబరేల్ నుంచి పోటీ చేయాలని సోనియా కుటుంబం నిర్ణయించింది. రాయ్ బరేలీ(Rahul at Raebareli) ఎందుకు సురక్షితం అని భావిస్తున్నారంటే..
Also Read: ఏపీలో అధికారం ఎవరిదో చెప్పేసిన RTV.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
- సమాజ్ వాదీ పార్టీతో పొత్తు
అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ కు ఇది సురక్షితమైన నియోజకవర్గంగా విశ్లేషిస్తున్నారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో SP ఎమ్మెల్యేలు ఉండగా, ఒకదానిలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బచరవాన్, హర్‌చంద్‌పూర్, సరణి, ఉంచహర్ స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక రాయ్‌బరేలీ(Rahul at Raebareli) నియోజకవర్గం బిజెపికి చెందిన అదితి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- ఇరవై లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సార్లు గెలిచింది
Rahul at Raebareli: 1952 నుండి 2019 వరకు జరిగిన ఇరవై లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సార్లు గెలిచింది. 1977లో జనతా పార్టీకి చెందిన రాజ్‌నారాయణ్, 1996, 1998లో బీజేపీకి చెందిన అశోక్ సింగ్ మాత్రమే మూడు సార్లు కాంగ్రెస్ కాకుండా గెలిచిన వారు. ఫిరోజ్ గాంధీ రెండుసార్లు, ఇందిరాగాంధీ మూడుసార్లు, సోనియాగాంధీ ఐదుసార్లు ఇక్కడి నుంచి ఎంపీలుగా ఉన్నారు.
- రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తే స్మృతి ఇరానీకి లాభం..
సోనియా గాంధీ కుటుంబం అమేథీ నుంచి పోటీ చేసే ఛాలెంజ్ తీసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తే స్మృతి ఇరానీ లాభపడే అవకాశం ఉంది. ఒకవేళ రాహుల్ కనుక ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోతే వరుసగా రెండుసార్లు ఓడిపోయిన వ్యక్తిగా ముద్ర పడుతుంది. అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తుంది. అందుకే రాయ్‌బరేలీ(Rahul at Raebareli) నియోజకవర్గాన్ని ఎంపిక చేసి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.
- ప్రియాంక గాంధీ రేసుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం
మరో కారణం, ప్రియాంక గాంధీ రేసుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో, కుటుంబంలో రాహుల్ గాంధీ ఒంటరిగా మిగిలిపోయారు. అందుకే తన తల్లి సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీని ఎంపిక చేసినట్లుగా వినిపిస్తోంది. అమేథీ, రాయ్‌బరేలీ(Rahul at Raebareli)తో పోలిస్తే.. నామినేషన్ పత్రాలు సమర్పించిన నియోజకవర్గం సేఫ్ అనే నిర్ణయానికి గాంధీ కుటుంబం వచ్చి ఉండవచ్చు.
- సోనియా గాంధీకి ఇక్కడ ఉన్న పేరు, 'గాంధీ పరివార్ కా బహు'
సోనియా గాంధీ 2004 నుండి 2019 వరకు ఐదు ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల నుంచి ఎన్నికలకు గెలుపు మార్జిన్ తగ్గుతోంది. అయితే ఆమెకు గాంధీ పరివార్ కా బహు అనే పేరు ఒకవైపు ఉంది. మరోవైపు తనకోసం ప్రియాంక, కిషోరి లాల్ శర్మలు రంగంలోకి దిగడంతో రాహుల్ గాంధీకి విజయం కష్టమేమీ కాదనే మాట కూడా వినిపిస్తోంది.