CM Revanth Reddy: సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ.. కారణమిదేనా?

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న వేళ.. వీరి భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.

New Update
CM Revanth Reddy: సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ.. కారణమిదేనా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ (Raghuram Rajan-Former Governor of the Reserve Bank of India) భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వచ్చిన రఘురామరాజన్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుడిగా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన అనంతరం రఘురామరాజన్ తగు సూచనలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ‘కాళేశ్వరం’పై సిట్టింగ్ జడ్జితో విచారణ.. నేరుగా కేసీఆర్, హరీశ్ కు గురి పెట్టిన రేవంత్?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆయన పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ అనేక సార్లు చెబుతోంది. ఈ మేరకు అధికారులతో సీఎం, ఆర్థిక శాఖ మంత్రి సమీక్షలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన శ్వేతపత్రం విడుదలకు సైతం ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థిక నిపుణుడు రఘురామరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవడం ప్రభుత్వంతో పాటు, రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది. ఈ సమావేశంలో రేవంత్ తో పాటు ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు