/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ragging-jpg.webp)
Raging Commotion at Ambedkar University : ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ సీనియర్లు మాత్రం మా పని మాదే అంటు ర్యాగింగ్(Raging) చేస్తునే ఉన్నారు. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా.. కాలేజీల్లో ర్యాగింగ్ బూతాన్ని మాత్రం తరిమేయలేకపోతున్నారు. ఏదో సరదాగా ర్యాగింగ్ అంటే కాస్త పర్లేదు కానీ.. కొన్ని చోట్ల మితిమిరీ ప్రవర్తిస్తుంటారు. తాజాగా, శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం(Ambedkar University) లో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ మెకానిక్ చదువుతున్న నలుగురు విద్యార్థులు తోటి విద్యార్థులపై ర్యాగింగ్ కి పాల్పడ్డారు. వారి ప్రవర్తనపై తోటి విద్యార్ధులు కంప్లైంట్ చేయడంతో ఆ నలుగురునీ సస్పెండ్ చేసింది యాజమాన్యం.
Also Read: ‘కేసీఆర్ త్వరగా కోలుకోవాలి..’ మాజీ సీఎం ఆరోగ్య స్థితిపై చంద్రబాబు, పవన్ ఏం అన్నారంటే?
అయితే, కంప్లైంట్ ఇచ్చిన విద్యార్థులపై కక్ష పెంచుకున్నారు సస్పెండ్ అయిన నలుగురు విద్యార్ధులు. దీంతో, మంగళవారం రాత్రి వసతి గృహాంలో పుట్టి రోజు వేడుకలు అంటూ పెద్ద ఎత్తున హంగామా చేశారు. అర్ధరాత్రి బాణాసంచా కాలుస్తూ తోటి విద్యార్థులకు అసౌకర్యం కలిగించారు. వారు పేల్చిన టపాసులు పక్కన ఉన్న లా విద్యార్ధుల బ్లాక్ లో పడడంతో ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రశ్నించగా.. వారిపై గొడవకు దిగారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ధర్డ్ సెమిస్ట్రీ పరీక్షలకు వెల్తున్న లా విద్యార్థుల పై రౌడీల్లా వ్యవహరిస్తూ వారిని చావ బాదారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యాజమాన్యం పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణం అని నిర్ధారించి క్యాంపస్ లో పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.