కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 81మంది అమ్మాయిలు సస్పెండ్!

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. లేడీస్‌ హాస్టల్‌లో జూనియర్లపై వేధింపులకు పాల్పడిన పీజీ 28 , కామర్స్ 28, ఎకనామిక్స్ 25, జువాలజీకి చెందిన మొత్తం 81మంది సీనియర్లను వారం రోజులు పాటు సస్పెండ్ చేశారు అధికారులు.

New Update
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 81మంది అమ్మాయిలు సస్పెండ్!

Warangal : వరంగల్ కాకతీయ యూనివర్సిటీ(Warangal Kakatiya University) లో అమ్మాయిలే ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కొంతకాలంగా జూనియర్ విద్యార్థినిలతో పరిచయాలు పెంచుకున్న సీనియర్లు ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తమతో చేయరాని పనులు చేయించుకున్నారని, కొన్నిసార్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ జూనియర్లంతా కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

ఈ మేరకు కేయూలోని లేడీస్‌ హాస్టల్‌(Ladies Hostel) లో పీజీ, కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు.. జూనియర్లపై ర్యాగింగ్ కు పాల్పడ్డట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుని 81మంది సీనియర్ విద్యార్ధినిలపై సస్పెండ్ చేశామని, ఇంత భారీ సంఖ్యలో సస్పెన్షన్ వేటు వేయడం యూనివర్శిటీ చరిత్రలో ఇదే మొదటిసారిగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Hyderabad: ఊటీని తలపించే అందాలు..ఇక నుంచి మన హైదరాబాద్ లోనే..!

గత కొన్ని రోజులుగా ర్యాగింగ్‌(Ragging) జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒకటి రెండుసార్లు లెక్చరర్స్, ఇంచార్టిలు ఇష్యూపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయినా పెద్దగా పట్టించుకోని సీనియర్ అమ్మాయిలు.. వరుస ర్యాంగింగుకు పాల్పడుతున్నారని జూనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై యాజమాన్య కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే ఈ వారం రోజుల్లో పలు సంఘటనలు జరిగినట్లు రుజువుకావడంతో పీజీ 28 , కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులతో కలిపి మొత్తం 81మంది విద్యార్థినులను వారం రోజులు పాటు సస్పెండ్ చేసినట్లు సంబంధింత డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. అలాగే ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యుత్తులో ర్యాగింగ్‌ భూతం రిపీట్ కాకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఇక ఈ విషయంపై జూనియర్ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ ర్యాంగింగ్ కు పాల్పడిన విద్యార్థినిలపై కేసులు నమోదు చేయాలని, ఇంకెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ యాజమాన్యానికి సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు