IPL-2024 : అశ్విన్ ఇలా బాదేశాడేంటీ..పిచ్చ కొట్టుడు కొట్టాడుగా.. ఇదేందెయ్యా ఇది...నేనెప్పుడూ సూసుండ్లే అంటున్నారు నిన్న రాజస్థాన్ రాయల్స్‌లో ఆటగాడు ఆర్.అశ్విన్ బ్యాటింగ్ చూసి. 19 బంతుల్లో 3 సిక్సులు బాది..29 పరుగులు చేశాడు. By Manogna alamuru 29 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి DC v/s RR : ఆర్. అశ్విన్(R Ashwin).. ఇతని గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు. భారత బౌలింగ్ పిల్లర్లలో ఒకడైన ఆశ్విన్ నిజానికి ఆల్ రౌండర్ అనే చెప్పుకోవాలి. మొదటి నుంచీ ఇతని బ్యాంటింగ్ ట్రాక్ బానే నడుపుకుంటూ వస్తున్నాడు. అయితే ఇతని సత్తా అంతా ఇప్పటివరకూ టెస్ట్ మ్యాచ్(Test Match) లలోనే చూపించాడు. మిగతా ఫార్మాట్లలో పెద్దగా ఏమీ లేదు. అదీకాక టీ20ల్లాంటి ఫాస్ట్ ఫార్మాట్‌లో ఇతను ఎప్పుడూ పెద్దగా బ్యాటింగ్ చేసింది లేదు. కానీ నిన్నటితో అది కూడా అధిగమించేశాడు అశ్విన్. తన ఆర్డర్ కన్నా ముందు వచ్చి మరీ చితక్కొట్టేశాడు. మూడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు.. నిన్న ఐపీఎల్(IPL) లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మ్యాచ్ జరిగింది. ఇందులో ఆర్ అశ్విన్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. దీనిలో 18 పరుగులు సికసుల ద్వా వచ్చినవే. బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన అశ్విన్ ఎదుర్కొన్న బౌలర్లు కూడా అల్లటప్పాగాళ్ళు కాదు. ముందు స్టార్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో ఒక సిక్స్ కొట్టిన అశ్విన్ తరువాత సూపర్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో రెండు సిక్సులు కొట్టి దిమ్మ తిరిగిపోయేలా చేశాడు. ఆ సిక్స్‌లు కూడా మామూలుగా లేవు. మ్యాచ్ చూసినవాళ్ళతో అరిపించేలా ఉన్నాయి. దీంతో నిన్నటి ఫెర్ఫామెన్స్‌కు అశ్విన్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఈ కొత్త కోణానికి మురిసి ముక్కలవుతున్నారు. SIX-HITTER ASHWIN IN T20..!!! 🔥pic.twitter.com/80j0Dm6uLz — Johns. (@CricCrazyJohns) March 28, 2024 మ్యాచ్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. నిన్నటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సమిష్టి కృషితో ఢిల్లీ డేర్ డెలవిల్స్ మీద 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్స్‌లో రియాన్ పరాగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ మొదటి బ్యాటింగ్ చేసి 185 పరుగులు లక్ష్యాన్ని ఢిల్లీకి ఇచ్చింది. అయితే లక్ష్య ఛేదనలో ఢి్లలీ తడబడిపోయింది. దీంతో 173 పరుగులకు ఆలౌట్ అయి ఓటమి పాలయింది. Also Read : Chai Pe Charcha: కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ #delhi-capitals #ipl-2024 #rajasthan-royals #crickeyt #r-ashwin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి