Telangana Elections: ఆ ఒక్క మాట వల్లే కొట్టాను.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేకానంద..

ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ పై చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పందించారు. గొడవపై వివరణ ఇచ్చారు. శ్రీశైలం తన తండ్రిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం వల్లే తాను క్షణికావేశానికి గురైనట్లు వివరణ ఇచ్చారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

Telangana Elections: ఆ ఒక్క మాట వల్లే కొట్టాను.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేకానంద..
New Update

Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారం ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే, తాజాగా కుత్బుల్లాపూర్(Quthbullapur) నియోజకవర్గం పరిధిలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA Vivekanand).. అదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి ఘటనపై తాజాగా క్లారిటీ ఇచ్చారు వివేకానంద. ఆ కారణంగానే చేయి చేసుకోవాల్సి వచ్చిందంటే వివరణ ఇచ్చారు వివేకా.

ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి సహా అనేక అంశాలపై చర్చ జరిగింది. ఇదే సమయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు జరుగుతున్నాయంటూ కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే వివేకానంద, శ్రీశైలం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో శ్రీశైలం గౌడ్.. ఎమ్మెల్యే వివేకాతో పాటు ఆయన తండ్రిని కూడా భూకబ్జాదారుడు అంటూ సంబోధించారు. ఆయన ఆ పదం అన్న కారణంగానే తనకు ఆగ్రహం వచ్చిందని, ఆ క్రమంలో శ్రీశైలంను అడ్డుకోబోయానని వివరణ ఇచ్చారు వివేకా. శ్రీశైలం తన తండ్రిపై నిరాధార ఆరోపణలు చేయడంతో ఆగ్రహానికి గురికావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు వివేకా. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేశారాయన.

'సూరారం రాంలీలా మైదానంలో జరిగిన చర్చా వేదికలో చోటు చేసుకున్న ఘటన పట్ల చింతిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. విపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా హుందాగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. బుధవారం జరిగిన చర్చలో.. నన్ను, నా తండ్రిని వ్యక్తిగతంగా పరుష పదజాలంతో విమర్శించారు. నాపై విమర్శలు చేసినా పట్టించుకునేవాడిని కాదు. కానీ, ఎలాంటి మచ్చ లేని, జనం కోసం ఎంతో చేసిన నా తండ్రిపై పరుష పదజాలంతో విమర్శలు చేయడం ఆగ్రహానికి గురి చేసింది. స్వర్గస్తులైన నా తండ్రిని టార్గెట్‌గా విమర్శలు చేయడంతో క్షణికావేశానికి గురయ్యాను. ఇలాంటి రాజకీయాలు ఎవరికీ మంచివి కాదు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను.' అంటూ క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే వివేకానంద.

కాగా, బుధవారం ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద.. బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ పై చేయి చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. వివేకానందపై నిషేధం విధించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.

Also Read:

పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

#hyderabad #hyderabad-news #telangana-news #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe