Sharukh Khan: మోదీ వల్ల కానిది.. షారుఖ్‌ ఖాన్‌ చేశారు: సుబ్రహ్మణ్య స్వామి

గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావీ అధికారుల్ని ఖతార్‌ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. షారుఖ్‌ ఖాన్‌ జోక్యంతోనే వాళ్లు విడుదలయ్యారని.. వాళ్లని విడిపించడంలో కేంద్రం విఫలమైందని మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు.

Sharukh Khan: మోదీ వల్ల కానిది.. షారుఖ్‌ ఖాన్‌ చేశారు: సుబ్రహ్మణ్య స్వామి
New Update

గుఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావీ అధికారులకు ఖతార్‌ ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఖతార్ దేశం వాళ్లని విడుదల చేసింది. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. ఈ 8 మంది మజీ నావికులు సినీ హిరో షారుఖ్‌ ఖాన్ జోక్యంతోనే విడుదలయ్యారని.. ఈ విషయంలో మోదీ సర్కార్‌ విఫలమైందంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు ఖతార్ వెళ్తున్నానంటూ ప్రధాని మోడీ ఎక్స్‌లో పెట్టిన పోస్టుపై ఆయన ఈ విధంగా స్పందించారు.

Also Read: కదం తొక్కిన రైతులు.. ప్రధాన డిమాండ్లు ఇవే..

షారుఖ్‌ ఖాన్‌ వల్లే అయ్యింది

మోడీ.. సినిమా స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ను కూడా తనతో పాటు తీసుకుపోవాల్సింది. ఎందుకంటే భారత మాజీ నావికులను విడిపించేందుకు ఖతార్‌ షేక్‌లను ఒప్పించే విషయంలో భారత విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు విఫలమయ్యారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని.. షారుఖ్‌ ఖాన్‌ను వేడుకున్నారు. షారుఖ్ జోక్యం వల్లే ఖతార్‌.. భారత నావికులను విడుదల చేసిందని అన్నారు.

గతంలో మరణశిక్ష విధించిన కోర్టు

ఇదిలాఉండగా.. 2022లో గూఢచర్యం ఆరోపణలతో 8 మంది భారత మాజీ నావి సిబ్బందిని ఖతార్‌ అధికారులు అరెస్టు చేశారు. వీళ్లలో.. కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, సౌరభ్‌ వశిష్ఠ్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, ఏపీలోని విశాఖకు చెందిన సుగుణాకర్‌ పాకాల, సెయిలర్‌ రాగేశ్‌ ఉన్నారు. అనంతరం ఈ వ్యవహారంపై ప్రాథమిక కోర్టులో విచారణ జరిపిన ఖతార్‌.. వాళ్లకి మరణ శిక్ష విధించింది.

Also Read: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్!

అయితే ఈ శిక్షను రద్దు చేయించడం కోసం కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా ప్రయత్నాలు చేసింది. దీంతో అప్పీలు చేసుకోవడానికి అక్కడి కోర్టు అనుమతి ఇచ్చింది. అప్పీల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మరణశిక్షను సాధారణ జైలుశిక్షగా మారుస్తూ.. 2023 డిసెంబర్‌ 28న తీర్పునిచ్చింది. అయితే సాధారణ జైలుశిక్షపై కూడ భారత విదేశాంగ శాఖ అప్పీల్‌కు వెళ్లింది. ఇక చివరికి గత సోమవారం ఆ 8 మంది మాజీ నావీ అధికారుల్ని విడుదల చేసింది.

#telugu-news #national-news #quatar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe