/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/putin-jpg.webp)
ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ను చర్చలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆయన అమెరికాను కోరారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు టక్కర్ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పుతిన్ తన అభిప్రాయాన్ని ఇలా వెల్లడించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గ్రెషక్కోవిచ్‌ను అప్పగింతకు సంబంధించిన అంశంలో కూడా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Also read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న!
మా ఏజెంట్‌ను విడిపించండి
వాస్తవానికి ఆ రిపోర్టర్ దేశద్రోహానికి పాల్పడ్డట్లు రష్యా ఆరోపిస్తోంది. అతడ్ని వదిలేయాలంటే.. జర్మనిలో ఉన్న తమ ఏజెంట్‌ను కూడా విడిపించాలని పుతిన్ అమెరికాను కోరారు. తాజాగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. అయితే దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎలాంటి బదులిస్తారో అనేది ఆసక్తి నెలకొంది.
మేమెప్పుడు చర్చలు వ్యతిరేకించలేదు
ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై రెండున్నరేళ్లు అవుతోంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా పౌరుల్ని కాపాడేందుకు యుద్ధం చేయాల్సి వస్తోందని పుతిన్ అన్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరకుండా ఉండేందుకు ఆ యుద్ధం అవసరమని పుతిన్ వ్యాఖ్యానించారు. తమతో చర్చలు నిర్వహించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆసక్తి చూపడం లేదని.. ఆయన్ని చర్చలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని అమెరికాను కోరారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా నిలిపివేసి.. ఆ దేశాన్ని చర్చల వైపు మళ్లించాలని అన్నారు. తాము ఎప్పుడూ కూడా అసలు చర్చలను వ్యతిరేకించలేదని.. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ రష్యాను దెబ్బతీయాలని అనుకుంటున్న పశ్చిమ దేశాల ప్లాన్ ఎప్పటికీ వర్కౌట్ కాదన్నారు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ లేకుండా 100 కంపెనీల్లో ఉద్యోగాలు!