Warm Water With Ghee: గోరువెచ్చని నీళ్లలో నెయ్యి వేసి తాగితే రోగాలు పరార్!

చలికాలంలో నెయ్యి తప్పనిసరిగా వాడాలి. గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం పోతుంది. కళ్లకు మేలు జరుగుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. జలుబు-దగ్గు దూరం లాంటి రోగాలు దూరం అవుతాయి. ఇది ఊబకాయాన్ని తగ్గించి, పొట్టను శుభ్రపరుస్తుంది.

New Update
Warm Water With Ghee: గోరువెచ్చని నీళ్లలో నెయ్యి వేసి తాగితే రోగాలు పరార్!

Warm Water With Ghee: మనం తినే ఆహారంలో ఖచ్చితంగా నెయ్యి ఉంటుంది. నేటికీ..అమ్మమ్మలు నెయ్యిని ఆరోగ్య సంపదగా భావిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో నెయ్యిని తప్పనిసరని పెద్దలు చెబుతారు. ప్రస్తుత కాలంలో ఊబకాయం కారణంగా నెయ్యికి దూరం చేస్తున్నారు. నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. మీ ఆహారంలో నెయ్యిని సరైన పద్ధతిలో తీసుకుంటే బరువు పెరగడం కంటే తగ్గించడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెయ్యితో పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటే గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగలి. టీస్పూన్ నెయ్యిని ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగడం వలన జీర్ణక్రియ, చర్మంలో తేడా కనిపిస్తుంది. నెయ్యి వేసి నీటిని ఎలా, ఏ సమయంలో తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేడి నీళ్లలో నెయ్యి

మలబద్ధకం: మలబద్ధకంతో బాధపడేవారు ఖచ్చితంగా నెయ్యి, నీళ్ల తాగాలి.పెద్ద, చిన్న ప్రేగులలో పొడిగా ఉన్నప్పుడు ఆహారం జీర్ణం కావడం కష్టం. మలబద్ధకం సమస్య ఉంటే గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది.

కళ్లకు మేలు: గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే కళ్లకు అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యి తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి పొడిబారడాన్ని తగ్గిస్తుంది మరియు కంటి అలసటను తొలగిస్తుంది. కళ్ల చుట్టూ నెయ్యి రాసుకున్న మంచి ఫలితం ఉంటుంది.

చర్మాన్ని మృదువుగా: చలికాలంలో గోరువెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగడం వల్ల పేగులు శుభ్రపడి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతుంది. చర్మానికి సహజమైన మాయిశ్చరైజింగ్‌గా నెయ్యి మేలు చేస్తుంది. చర్మం లోపలి నుంచి తేమగా ఉన్నప్పుడు..చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది.

జలుబు-దగ్గు దూరం: రోజూ నెయ్యిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జలుబు దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నెయ్యి, గోరువెచ్చని నీరు ముక్కు, గొంతు, ఛాతీకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.

ఇది కూడా చదవండి: చలికాలంలో గరం మసాలా ఎందుకు తినాలి..? ప్రయోజనాలను తెలిస్తే ఇక వదలరు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు