Pushpa 2: "మరో 200 రోజుల్లో పుష్ప రాజ్ రూల్ బిగిన్స్".. అదిరిపోయే అప్డేట్

2024 లో రాబోతున్న చిత్రాల్లో మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ పుష్ప 2. ఈ మూవీ పై మరింత ఆసక్తిని పెంచేలా మేకర్స్ మరో లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. "పుష్ప రాజ్ రూల్ ప్రారంభించడానికి ఇంకా 200 రోజులు మాత్రమే మిగిలింది" అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Pushpa 2: "మరో  200 రోజుల్లో పుష్ప రాజ్ రూల్ బిగిన్స్".. అదిరిపోయే అప్డేట్

Pushpa 2 Update: సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పుష్ప 2. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021 లో విడుదలైన పుష్ప 'ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 (Pushpa 2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పుష్ప 'ది రైజ్' చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ ఆగస్టు 15 న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక మేకర్స్ రిలీజ్ అయ్యేవరకు ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెంచడానికి ఏదో ఒక అప్డేట్ వదులుతూనే ఉన్నారు.

పుష్ప 2 లేటెస్ట్ అప్డేట్

ఇక తాజాగా పుష్ప 2 నుంచి వచ్చిన మరో లేటెస్ట్ అప్డేట్ మూవీ పై మరింత ఆసక్తిని పెంచేసింది. "పుష్ప రాజ్ రూల్ ప్రారంభించడానికి ఇంకా 200 రోజులు (Pushpa 2 in 200 Days) మాత్రమే మిగిలింది" అంటూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ చూసిన బన్నీ అభిమానులు పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు అంటూ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ విషయాన్నీ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరలవుతుంది.

Also Read: Chaitanya post: విడాకుల పై నిహారిక కామెంట్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త

publive-imageరిలీజ్ కు ముందు పుష్ప 2 ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. కన్నడ బ్యూటీ రష్మిక మందన (Rashmika Mandanna) ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇక పార్ట్ 2 లో కూడా నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read: RGV Tweet: చిరంజీవి పద్మ విభూషణ్ పై.. వైరలవుతున్న RGV ట్వీట్

Advertisment
తాజా కథనాలు