Ratna Bhandagaram: రేపు తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రత్నభాండాగారం మూడోగది పూరీ జగన్నాధుని రత్నభాండాగారంలో మూడో రహస్య గది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ గదిని రేపు అంటే జూలై 18న తెరవనున్నారు. అక్కడి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామని భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. By KVD Varma 17 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Jagannath Puri Ratna Bhandar: పూరీ జగన్నాధుని ఆలయంలో రత్నభాండాగారాన్ని తెరిచి నిధుల లెక్కలు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రత్నభాండాగారంలో మూడో రహస్య గది కూడా ఉందని వెలుగులోకి వచ్చింది. అందులో కూడా అంతులేని సంపద ఉందని చరిత్రకారులు చెప్పారని కథనం ప్రచారంలోకి వచ్చింది. దీంతో మూడో రహస్యగదిని తెరవాలని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రేపు అంటే జూలై 18న ఈ గది తలుపులు తెరవనున్నారు. ఉదయం 9.51 గంటల నుంచి 12.15 వరకూ దీనికోసం శుభ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించారు. రేపు ఈ గదిని తెరిచిన తరువాత అక్కడ ఉన్న స్వామి వారి సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్ కు తరలిస్తారు. ఆ తరువాత భాండాగారానికి మరామ్మత్తులు చేయిస్తారు. ఆ పనులు పూర్తి అయ్యాకా.. తిరిగి సంపదను అక్కడకు చేరుస్తారు. ఆ తరువాతే నిధుల లెక్కింపు ఉంటుంది. ఈ విషయాలను భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఇప్పటికే రెండు రహస్య గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్ కు తరలించారు. మొత్తంగా ఈ రత్నభాండాగారంలోని సంపద ఎంత ఉంటుంది అనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అందరిలోనూ ఇది చాలా ఆసక్తికరంగా మారింది. మూడో రహస్యగది ఇలా బయటపడింది.. Ratna Bhandagaram: పూరీ జగన్నాథుని రత్నభాండాగారంలో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, సొరంగ మార్గాలు అనేకంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు మరో సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతుచిక్కని పూరీ జగన్నాధుని నిధుల రహస్యం..ఇటీవల జగన్నాధుని రత్నభాండాగారం తలుపులు తెరిచి, అక్కడి నిధుల లెక్కింపు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు రత్నభాండాగారం అడుగున మరో రహస్య గది ఉందంటోన్న చరిత్రకారులు. ఆ గదిలోకి సొరంగమార్గం ద్వారా వెళ్లొచ్చని తెలుస్తోంది. ఆ గదిలోనూ వెలకట్టలేని స్వామివారి సంపద ఉందని చరిత్ర చెబుతోంది. అందులో 34 కిరీటాలు, రత్నఖచిత స్వర్ణ సింహాసనాలు అలాగే మహాలక్ష్మికి సంబంధించిన వడ్డాణాలు, కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయని అంటున్నారు. గర్భగుడి నుంచి పతిత పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువై ఉన్నాయని చెబుతున్నారు Ratna Bhandagaram: అక్కడకు 1902లో బ్రిటీష్ పాలకులు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని పంపించి విఫలం అయ్యారని చరిత్రకారులు అంటున్నారు. అలనాటి రాజులు యుద్ధాలు చేసి ఎనలేని సంపద తెచ్చి పురుషోత్తముడికి సమర్పించారని చరిత్రకారుల భావనగా ఉంది. భాండాగారం దిగువన సొరంగమార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మాణం చేపట్టారు. ఆ రహస్య గదిని తెరవాలని..అందులోని సంపదను కూడా లెక్కించాలనీ చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం 2 గదులను తెరిచి అందులోని సంపదను చంగడా గోపురానికి తరలించారు. ఇక మూడోగదిని ఎప్పుడు తెరవాలన్నదానిపై కమిటీ మరోసారి సమావేశం కానుంది. ప్రస్తుతం రత్నభాండాగారం మరమ్మతులు, సంపద లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. #puri-jagannadh #ratna-bhandagaram #ratna-bhandar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి