/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-87-jpg.webp)
Ex MLA Shakeel Son Case : హైదరాబాద్(Hyderabad) లోని తెలంగాణ ప్రజాభవన్(Telangana Praja Bhavan) గేటును తాగి కారు నడిపి గుద్దిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్(Shakeel Son Sahil) నిందితుడు. ఇదే కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావు(Punjagutta CI Durga Rao) కూడా నిందితుడిగా ఉన్నారు. సాహిల్‌ను తప్పిండచంలో సీఐ సహాయం చేశారని ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఇంతకు ముందే ఈ కేసులో ఏ11 నిందితుడిగా ఉన్న దుర్గారావును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి అతను అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నారు. అయితే ఈ కేసు కోర్టులో విచారణకు రాకముందే సీఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం ఆంధ్రాలోని గుంతకల్లు రైల్వే స్టేషన్(Guntakal Railway Station) లో దుర్గారావు పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. వెస్ట్ జోన్ డీజీపీ ఆఫీస్‌లో ఇతన్ని విచారిస్తున్నారు.
ఏం జరిగింది..
గత నెల 23న సాహిల్ ప్రజాభవన్ ముందు కారుతో బీభత్సం సృష్టించాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రజాభవన్ వద్ద ఉన్న బారీకేడ్లను ఢీకొట్టి ధ్వంసం చేశాడు. అయితే ఈ సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేవు. కారు ప్రమాదం(Car Accident) విజువల్స్ చివరికి సీసీ టీవీ కెమెరాల్లో దొరికాయి. దీంతో పోలీసులు సాహిల్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను కూడా సస్పెండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే షకీల్ మీదా కేసు నమోదు
పంజాగుట్ట పోలీసులు ఈ కేసులో బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. తన కొడుకు సాహిల్ అలియస్ సాహిల్ దుబాయ్(Dubai) కు పారిపోయేందుకు షకీల్ సహకరించాడని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగాక.. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు 10 మంది వరకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు.. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సాహిల్‌పై పోలీసులు ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్‌కు పారిపోయిన అతడ్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read : ఉచిత విద్యుత్ పొందాలంటే ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..స్పష్టం చేసిన కేంద్రం