/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/punjab.jpg)
America : అమెరికాలోని న్యూ జెర్సీ (New Jersey) లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో (Firing) భారత సంతతికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పులు జరిపిన దుండగుడు, కాల్పుల్లో చనిపోయిన మహిళ సహా ముగ్గురూ భారత్ లోని పంజాబ్ (Punjab) రాష్ట్రానికి చెందిన వారే అని అధికారులు తెలిపారు. బాధిత మహిళలు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు కాగా.. వారితో నిందితుడికి ఇండియాలోనే పరిచయం ఉందని సమాచారం. ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూజెర్సీ రాష్ట్రంలోని మిడిల్ సెక్స్ కౌంటీలో బుధవారం ఉదయం ఇద్దరు మహిళలపై ఓ యువకుడు కాల్పులు జరిపాడు. రోడ్డు పక్కన నడుస్తున్న అక్కాచెల్లెళ్ల పై నిందితుడు చాలా దగ్గరి నుంచి కాల్పులు జరిపి పారిపోయాడు. దీంతో భారత సంతతికి చెందిన పంజాబీ మహిళ జస్వీర్ కౌర్ (29) అక్కడికక్కడే చనిపోగా, ఆమె సోదరి (20) కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే బాధితులను ఇద్దరినీ ఎయిర్ ఆంబులెన్స్ సాయంతో నెవార్క్ లోని ఓ హస్పిటల్ కి తరలించారు.
అప్పటికే జస్వీర్ కౌర్ (Jaswir Kaur) చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమె సోదరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, కాల్పులు జరిపిన యువకుడిని గౌరవ్ గిల్ గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నానికి గౌరవ్ ను అతడి ఇంటి వద్దే అరెస్టు చేశారు. జస్వీర్ కౌర్, ఆమె సోదరి ఇద్దరూ తనకు తెలుసని నిందితుడు పోలీసులకు తెలిపాడు. పంజాబ్ లో జస్వీర్ సోదరి, తాను కలిసి చదువుకున్నట్లు వెల్లడించాడు. అయితే, కాల్పులు జరపడానికి కారణమేంటనే విషయాన్ని పోలీసులు బయటపెట్టలేదు.
Man fires at two Jalandhar women in New Jersey killing one#JalandharwomeninNewJerseykillingone #jalandharwomen pic.twitter.com/UQ2gMVSp0t
— True Scoop (@TrueScoopNews) June 15, 2024