Watch Video: అధికారితో బలవంతంగా పంట వ్యర్థాలను దగ్ధం చేయించిన రైతులు..

ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చడాన్ని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. పంజాబ్‌లో పంట వర్థాలు కాల్చడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఓ అధికారిని అక్కడి రైతులు బలవంతగా ఓ కుప్పకు మంట పెట్టించడం చర్చనీయాంశమైంది.

New Update
Watch Video: అధికారితో బలవంతంగా పంట వ్యర్థాలను దగ్ధం చేయించిన రైతులు..

ప్రస్తుతం ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలోకి వెళ్లింది. బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే దేశ రాజధానిలో గాలి నాణ్యత విపరీతంగా పడిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి కంటే ఇక్కడ వందరేట్లు అధిక కాలుష్యం ఉన్నట్లు గుణంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సర్కార్ పాఠశాలలకు ఈనెల 10వరకు సెలవులు పొడగించింది. ఇదిలాఉండగా.. పంజాబ్‌లోని బటిండా జిల్లాలో ఓ అనూహ్య ఘటన జరిగింది. పంట వ్యర్థాలను కాల్చడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతేకాదు బలవంతంగా ఆయనతోనే ఓ పంట వ్యర్థాల కుప్పకు మంట పెట్టించిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

కాలుష్యం పెరగడం వల్ల పంజాబ్‌తో సహా హర్యానా, ఢిల్లీ్ ప్రాంతాల్లో పంట వ్యర్థాలు కాల్చడాన్ని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. దీనికోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగానే ఓ అధికారి పంటవ్యర్థాలను కాల్చకుండా రైతులను అడ్డుకోబోయాడు. కానీ అక్కడున్న వ్యవసాయ సంఘానికి చెందిన 50 నుంచి 60 మంది రైతులు ఆయన్ని చుట్టుముట్టారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న ఓ వరికుప్పకు తీసుకొనివెళ్లారు. అతని చేతికి అగ్గిపెట్టె ఇచ్చి బలవంతగా దానికి మంట పెట్టించేలా చేశారు. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రైతుల చర్యలను ఖండించారు. వాళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు.

చివరికి ఆ అధికారిని అడ్డుకున్న రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారిని పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. ప్రభుత్వ అధికారి డ్యూటీని అడ్డుకున్నందుకు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతోనే ఢిల్లీలో నెలకొన్న కాలుష్యానికి కారణమని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా వెల్లడించింది. ఢిల్లీలో చలికాలం అంటే.. ముఖ్యంగా నవంబర్-డిసెంబర్ మధ్య కాలుష్యం భారీ స్థాయిలో పెరుగుతోంది. దీనికి చుట్టుపక్కల రాష్ట్రాల పంట వ్యర్ధాల దగ్ధంతో పాటు వాహన కాలుష్యం అలాగే బాణసంచా కాల్చడం వంటివి కూడా మరింత ఆజ్యం పోస్తున్ననట్లు పేర్కొంది.

Also Read: నాకు పెళ్లి చేస్తేనే ఎన్నికల విధులకు వస్తా..ఓ టీచర్ వింత కోరిక!

Advertisment
తాజా కథనాలు