పిల్లలు చేసిన తప్పుకు..తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా! పిల్లలు తెలియక చేసిన తప్పుకు.. తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా విధించిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా లో చోటు చేసుకుంది.బీచ్ లో అనుమతి లేకుండా తీసుకువెళ్లిన వస్తువులకు గాను వారికి అధికారులు ఈ జరిమానా విధించారు. By Durga Rao 28 May 2024 in ఇంటర్నేషనల్ వైరల్ New Update షేర్ చేయండి అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన షార్లెట్ రస్ అనే మహిళ..తన పిల్లలను సమీపంలోని పిస్మో బీచ్‌కు తీసుకెళ్లింది. అక్కడ పిల్లలు సముద్రపు అలల్లో ఆడుకుంటూ ఉన్న సమయంలో వారికి సముద్రపు గుల్లలుగా భావించి క్లాన్స్ ను ఒడ్డుకు తీసుకెళ్లారు.అయితే బీచ్ లో క్లాన్స్ ను బయటకి తీసుకువెళ్లందుకు అక్కడి అధికారుల అనుమతి పొందాలి.కాని వారు ఆ పని చేయలేదు.అయితే బీచ్ కు వెళ్లిన 5 గురు పిల్లలు కలసి మొత్తం 72 క్లాన్స్ ను సేకరించారు. ఈ సందర్భంలో, సముద్రతీరంలో మత్స్యశాఖ అధికారులు సరైన అనుమతి లేకుండా క్లాన్స్ అనే మక్కలను సేకరించిన పిల్లలను పట్టుకున్నారు. అధికారులు పిల్లల తల్లి షార్లెట్ రస్, 88,000 US డాలర్లు (భారత కరెన్సీలో రూ. 73 లక్షలు) జరిమానా విధించారు. దీంతో షార్లెట్ రస్ షాక్ అయ్యింది.తెలియక చేసిన తప్పుకు పిల్లలకు ఇంత జరిమానా విధించాలా? అని ఆమె మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను మానసికంగా ఎంతగానో ప్రభావితం చేసిందని ఆమె తెలిపారు. ఫిషరీస్ నిబంధనల ప్రకారం.. మస్సెల్స్ అని పిలువబడే ఆ జీవులు నాలుగున్నర అంగుళాల వరకు పెరగుతాయి.ఒక వేళ వాటిని ఎవరైనా తక్కువ పొడవు ఉండి తీసుకెళితే భారీగా జరిమానా విధించే నిబంధన ఆ బీచ్ లో ఉందని తెలిపారు. ఆ విధంగా చార్లెట్ రస్ పై ఈ భారీ జరిమానా విధించినట్లు అధికారులు వివరించారు. #trending #trending-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి