Photos: ఫొటోలు తీస్తుంటే పొట్ట వెనక్కి లాగుతున్నారా..? జాగ్రత్త ఫొటోకి పోజులిచ్చేటప్పుడు సన్నగా కనిపించేందుకు ఊపిరి బిగబట్టి పొట్టను లోపలికి లాక్కుంటూ ఉంటారు.ఇలా చేస్తే ఉదర కండరాలపై ఒత్తిడి పడి దుష్ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కడుపులో అసౌకర్యం, శరీరం అలసిపోవడం, వెన్నునొప్పి కూడా వస్తుందని అంటున్నారు. By Vijaya Nimma 12 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Photos: స్మార్ట్ ఫోన్ వచ్చాక అందరూ ఫోటోగ్రాఫర్లే కనిపిస్తున్నారు. అయితే.. చాలామంది ఫోటోలు దిగటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. మంచి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పుడు, ఫంక్షన్ ల్లో ఫోటోలు మంచిగా రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఫోటోలు తీసుకోవడం సరదానే కావచ్చు కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. లేకపోతే..అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు (Doctors) హెచ్చరిస్తున్నారు. అయితే .. ఫోటోల విషయాలపై కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాల ఆరోగ్య ప్రభావాలు: మనలో చాలా మంది ఫొటోకి పోజులిచ్చేటప్పుడు సన్నగా కనిపించేందుకు ఊపిరి బిగబట్టి పొట్టను లోపలికి లాక్కుంటూ ఉంటారు. ఇలా చేస్తే ఫొటోలో అందంగా కనిపించవచ్చు కానీ దీర్ఘకాల ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కడుపుని లోపలికి అనుకోవడం వల్ల ఉదర కండరాలపై ఒత్తిడి పడి దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా కడుపులో అసౌకర్యం, శరీరం అలసిపోవడం, కొన్నిసార్లు వెన్నునొప్పి కూడా వస్తుందని అంటున్నారు. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది: కడుపును లోనికి అనుకోవడం వల్ల డయాఫ్రాగమ్ సహజ కదలికకు అంతరాయం ఏర్పడుతుందని, శ్వాస సామర్థ్యాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల ఊపిరితిత్తుల (Lungs) సామర్థ్యం కూడా తగ్గిపోతుందని ఫిట్‌నెస్ నిపుణులు (Fitness experts) చెబుతున్నారు. ఇలా అప్పటికప్పుడు టమ్మీ టక్స్‌తో పొట్టని తక్కువ చేసి చూపించే బదులు బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. అందుకు సమతుల్య, ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఈ సమస్యలు తప్పవు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: అంతరించిపోతున్న ఉడతలు.. ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే..? #health-benefits #photos #health-problems #careful #stomach-back మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి