Paris : మోనాలిసా చిత్రం మీద సూప్... నిరసన

మోనాలిసా...అందానికి చిరునామాగా నిలిచిన చిత్రం. డావెన్సీ గీసిన ఈ బొమ్మ వర్ల్డ్ ఫేమస్. దీని ఒరిజినల్ చిత్రం ప్యారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉంది. దీని మీద సూప్ జల్లి తమ నిరసనను తెలియజేశారు ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు.

New Update
Paris : మోనాలిసా చిత్రం మీద సూప్... నిరసన

Mona Lisa Painting : కొన్ని వందల ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అద్భుతమైన పెయింటింగ్ కీర్తి పొందుతూ వస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించి... అబ్బురపరుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అందానికి నిర్వచనం అయింది. పెయింటింగ్ అంటే అలా ఉండాలి అంటారు. దాన్ని చూసి తమ కళకు మెరుగులు దిద్దుకున్నవారు ఎందరో. అంతటి అద్భుత సృష్టి చేసింది లియోనార్డో డావెన్సీ(Leonardo Da Vinci) అయితే ఆ అపురూపమైన చిత్రమే మోనాలిసా పెయింటింగ్. కొన్ని పదుల ఏళ్ళ నుంచీ దీన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు. దీని నకళ్ళు చాలానే చోట్ల ఉన్నాయి. కానీ డావెన్సీ వేసిన ఒరిజినల్ చిత్రం మాత్రం ప్యారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ఉంది.

Also Read : YS Sharmila:కడప రాజకీయాల్లో సంచలనం..షర్మిలతో సునీత భేటీ.

పెయింటింగ్ మీద సూప్...

ఇప్పుడు దీని మీదనే సూప్ చల్లారు ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు. రీ పోస్ట్ అలిమెంటయిర్ గ్రూప్‌కు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు మోనాలిసా పెయింటింగ్(Monalisa Painting) మీద గుమ్మడి సూప్‌(Pumpkin Soup) ను విసిరి కొట్టారు. దాని తర్వాత వ్యవసాయరంగంగ దుర్భరంగా ఉంది...మన రైతులు చనిపోతున్నారంటూ నినాదాలు చేశారు. కళ, ఆరోగ్యకరమైన ఆహారం రెండింటిలో ఏది ముఖ్యమైనది అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి అంటూ గొడవ చేశారు.

publive-image

మోనాలిసా చిత్రానికి ఏమైంది...

నిరసనకారులు సూప్ అయితే చల్లారు కానీ మోనాలిసా చిత్రానికి మాత్రం ఏం కాలేదు. ఎందుకంటే దాని చుట్టూ ఒక గాజు ఫ్రేమ్ ఉంటుంది. ఇంతకు ముందు ఇలాంటి ఘటనలోనే..1950లో ఓ సందర్శకుడు పెయింటింగ్ మీద యాసిడ్ పోశాడు. దాంతో మోనాలిసా చిత్రం దెబ్బతింది. ఆ తరువాత దాన్ని బాగు చేయించి గాజు ఫ్రేమ్‌లో పెట్టారు. 2019లో పారదర్శకంగా ఉండే బుల్లెట్ ప్రూఫ్ అద్దాన్ని రక్షనగా బిగించారు. 2022లో కూడా భూమిని కాపాడాలంటూ పెయింటింగ్ మీదకు కేక్‌ను విసిరాడు.

నిరసకారులు అరెస్ట్...

ఘటన జరిగిన వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. పర్యావరణ కార్యకర్తలను అరెస్ట్ చేసి వెంటనే అక్కడ నుంచి తరలించారు. దాని తరువాత మోనాలిసా చిత్రాన్ని తొలగించి...అక్కడంతా శుబ్రం చేయించారు. గంట తర్వాత మళ్ళీ దాన్ని యథా స్థానంలో పెట్టి ప్రదర్శనకు ఉంచారు. మోనాలిసా పెయింటింగ్ వారసత్వ సంపద అని...దాన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని అంటోంది ఫ్రెంచ్ గవర్నమెంట్. ఉద్యమకారుల వాదనలో అర్ధం లేదని కొట్టి పడేసింది. ఆయిల్ రేట్లు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువ అయ్యాయని శుక్రవారం రైతులు పారిస్‌(Paris) ను చుట్టుముట్టారు.

Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురు దుర్మరణం..

Advertisment
తాజా కథనాలు