Vijayawada : బ్యూటీ పార్లర్(Beauty Parlor) ముసుగులో వ్యభిచారం నడుపుతున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయట స్పా(SPA) బోర్డులు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్న నిర్వాహకులు లోపలికి వెళ్లిన పురుషులకు మహిళల ఆశ చూపి బుట్టలో పడేస్తున్నారు. ఇదే అదనుగా భారీగా డబ్బులు దండుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేని మహిళలలను టార్గెట్ చేసి వ్యభిచారంలోకి దింపుతున్నారు. విజయవాడ(Vijayawada) నగరంలో మరోసారి ఈ దందా బయటపడింది.
ఇది కూడా చదవండి : బషీర్ బాగ్ లో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన నిజాం కాలేజీ స్టూడెంట్స్
ఈ మేరకు ACP భాస్కరరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా మంగళవారం రాత్రి బందర్ రోడ్ లోకి వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలు వస్తుండటం, అక్కడ అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విజయవాడ కేంద్రంగా మంగళవారం రాత్రి బందర్ రోడ్ లోవున్న సిరి థాయ్ స్పా, Tranquil స్పా, ఈ 2స్పా సెంటర్స్ మీద రైడ్స్ నిర్వహించాం. అందులోకి వెళ్లగానే అసలు గుట్టు బయటపడింది. లోపల వ్యభిచారం చేస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే తనిఖీలు నిర్వహించగా ఇద్దరు నిర్వాహకులు పట్టుబడగా అదుపులోకి తీసుకున్నాం. 3 విటులను పట్టుకున్నాం. కొంతమంది పరారిలో ఉన్నారు. మహిళ victims సుమారు 9 మందిని పట్టుకోగా వారిని హోం కు తరలించి వైద్య పరీక్షలు అందిస్తున్నాం. మహిళ విటులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఆన్ లైన్ Justdial ద్వారా కస్టమర్ల ఫోన్ డేటా నంబర్లను సేకరించి ఫోన్ చేస్తున్నారు. నిర్వాహకులపై IPC సెక్షన్ 370, IPC ,3,4,5,6,7 కింద కేసులు నమోదు చేసినట్లు విజయవాడ ACP భాస్కరరావు తెలిపారు.