Milk-Banana: అరటిపండుతో పాటు పాలు తాగడం హానికరమా.. అందులో నిజం ఎంత..? అరటిపండు, పాలు ఆరోగ్యానికి మంచిదని అందరికి తెలుసు. అయితే.. ఈ రెండు కలిపి తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు అరటి-పాలు కలిపి తీసుకోకుడదు. ఎలాంటివారు తీసుకోకుడదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Milk-Banana: అరటిపండు, పాలు చాలా ఆరోగ్యకరమైన ఆహారాలు. శరీరానికి అవసరమైన పోషకాలు రెండింటిలోనూ లభిస్తాయి. అరటిపండు, పాలు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. దీన్ని తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. అయితే.. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. అరటిపండు-పాలు కలిపి తీసుకుంటే కొంతమందికి హానికరం కూడా కావచ్చు. కొన్ని వ్యాధులతో బాధపడేవారు ఈ ఆహార కలయికను ఉపయోగించకూడదని.. లేకుంటే తీవ్ర హాని జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాంటి వారు అరటి, పాలు కలిపి తీసుకుంటే విషంలా పని చేస్తుందంటన్నారు. కాబట్టి.. దీని వినియోగానికి దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు. అరటిపండు, పాలు ఎప్పుడు.. ఎవరు కలిపి తినకూడదో ఇక్కడ కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాలు-అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు: జీర్ణవ్యవస్థ చెడిపోతూ ఉండే అలాంటి వ్యక్తులు ఎప్పుడూ అరటిపండు, పాలు కలిపి తినకూడదు. లేకపోతే.. జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతినటంతోపాటు పూర్తిగా చెదిరిపోతుంది. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. ఆస్తమా రోగులకు పాలు, అరటిపండు కలిపి తీసుకున్న కూడా చాలా ప్రమాదకరం. వారు దీనికి దూరంగా ఉండే మంచిది. ఎందుకంటే రెండింటినీ కలిపి తీసుకుంటే కఫం, దగ్గు సమస్యతోపాటు ఆస్తమాను పెంచుతుంది. దీని వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలెర్జీ సమస్య ఉన్నవాళ్లు కూడా అరటి, పాలు తినడం మానుకోవాలి. ఎందుకంటే ఈ రెండు కలిస్తే అలెర్జీ ఎక్కువగా పెంచుతుంది. దీని కారణంగా దద్దుర్లు, దురద, అనేక చర్మ సంబంధిత అలర్జీలు ఇబ్బందిని వస్తాయి. కాబట్టి అలాంటి వారు అరటిపండు, పాలు తీసుకోకుండా ఉండాలని అంటున్నారు. సైనస్ ఉన్నవారు తినడం, తాగడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాంటి వారు పాలు, అరటిపండును తీసుకుంటే సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి సైనస్‌తో బాధపడేవారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కు దూరంగా ఉంటే మంచిదంటున్నారు. ఇది కూడా చదవండి: మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ మధ్య తేడా ఏమిటి..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #milk-banana #health-benefits #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి