Telangana Education Department : రంగారెడ్డి జిల్లా (Rangareddy District) విద్యాశాఖలో అధికారుల భారీ తప్పిందం బయటపడింది. గతేడాది చనిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి (Government Teacher) కి ప్రమోషన్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు తెలంగాణ (Telangana) లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఉద్యోగ విరమణల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికి 830 మంది ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించగా.. మరో 955 మందిని బదిలీ చేశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మంచాల మండలం తిప్పాయిగూడకు చెందిన బషీర్ (సీరియల్-129, రోస్టర్ పాయింట్స్-163)కు ప్రమోషన్ కల్పించడం చర్చనీయాంశమైంది.
హిందీ పండిట్ గా పనిచేసిన ఎండీ బషీర్..
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను తయారు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మంచాల మండలం తిప్పాయిగూడలో హిందీ పండిట్ గా పనిచేసిన ఎండీ బషీర్ 2023 జూన్ 1న మరణించారు. కానీ ఆయనకు గ్రేడ్-2 హిందీ పండిత్ (School Assistant) గా పదోన్నతి కల్పించడంతో పాటు ఏకంగా కొందుర్గ్ మండలం చిన్నెల్కచెర్ల ప్రభుత్వ పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే లిస్ట్‌లో బషీర్ పేరు ఉండటంతో తోటి ఉపాధ్యాయులంతా షాక్ అయ్యారు. వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పొరపాటును గ్రహించి లిస్ట్ నుంచి బషీర్ పేరును తొలగించి మరో లిస్టు విడుదల చేశారు. దీనిపై స్పందించిన.. డీఈవో సుశీందర్‌రావు.. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. చనిపోయిన ఉపాధ్యాయుడి పేరు లిస్టులో వచ్చింది. బషీర్ స్థానంలో అర్హులను పోస్టింగ్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదిలావుంటే.. 2024 మార్చిలో వెలిజర్ల ప్రభుత్వ పాఠశాల నుంచి పదవీ విరమణ చేసిన కె.రవీంద్రనాథ్కు స్కూల్ అసిస్టెంట్, బయాలజికల్ సైన్స్ పదోన్నతి కల్పించడమే కాకుండా ఆయనకు జెడ్పీహెచ్ఎస్ కొందుర్గ్ పోస్టింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తడంతో వెంటనే పదోన్నతుల జాబితా నుంచి వారి పేర్లు తొలగించారు.
Also Read : రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారు.. టీడీపీ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్..!