Kodandaram : రేవంత్ రెడ్డి కేబినెట్‌లోకి ప్రొఫెసర్ కోదండరాం? ఆ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్!

మంత్రివర్గ విస్తరణపై రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలెట్టారు. కోదండరాంకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీ.జేఏసీ చైర్మన్ హోదాలో నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు కోదండరాం.

Kodandaram : రేవంత్ రెడ్డి కేబినెట్‌లోకి ప్రొఫెసర్ కోదండరాం? ఆ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్!
New Update

Prof Kodandaram In Revanth Cabinet : గవర్నర్(Governor) కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ(MLC) లు ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram), అమీర్ అలీఖాన్ శనివారం తెలంగాణ(Telangana) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ని కలిసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కోదండరాం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కోదండరాంకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో రేవంత్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణ జరగనుందని సమాచారం. ఈ విస్తరణలోనే కోదండరాంకు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Also Read : BREAKING: బీఆర్ఎస్ ఆఫీసులో కూల్చివేతలు!


ప్రొఫెసర్‌కు ప్రాధాన్యత:
మంత్రివర్గ విస్తరణపై రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలెట్టారు. మంత్రివర్గంలో కొత్తగా ఆరుగురికి చోటు కల్పించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మైనార్టీకు ఈ మంత్రవిర్గంలో చోటు దక్కుతుందా లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది. నెలాఖరు నాటికి కసరత్తు పూర్తి చేసి అధిష్ఠానానికి లిస్ట్‌ పంపనున్నారు సీఎం. ప్రస్తుతం కేబినెట్ లో 12 మంది మంత్రులు ఉండగా.. మరో ఆరుగురికి ఛాన్స్ ఇవ్వనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) కాంగ్రెస్‌కు కోదండరాం టీజేఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఇక టీ.జేఏసీ చైర్మన్ హోదాలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు కోదండరాం. తెలంగాణ వచ్చినా.. ప్రొఫెసర్ కోదండరాంకు ప్రాధాన్యత దక్కలేదు.

గవర్నర్‌పై కేటీఆర్‌ ఫైర్:
తెలంగాణ జనసమితి(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం. కోదండరామ్‌ను గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసేందుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) తప్పుబట్టారు. కీలక నిర్ణయాల విషయంలో గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో దాసోజు శ్రవణ్ , సత్యనారాయణను ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయగా వారిని గవర్నర్ తిరస్కరించారన్నారు. వారి రాజకీయ సంబంధాలను నిందించారని గుర్తు చేశారు. అయితే టీజెఎస్‌కు నాయకత్వం వహిస్తున్నప్పటికీ ప్రొఫెసర్ కోదండరామ్ అనుబంధాలను పట్టించుకోలేదని ఆయన ఎత్తి చూపారు. కోదండరామ్ నామినేషన్‌పై గవర్నర్ వేగంగా స్పందించారని, అయితే శ్రవణ్, సత్యనారాయణలపై స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ ప్రజా నిధులతో నడుస్తోందన్నారు కేటీఆర్.

Also Read: ఆలయంలో కూలిన స్టేజీ.. ఒకరు మృతి, 17 మందికి గాయాలు!

#telangana #revanth-reddy #kodandaram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe