Dil Raju : ఆడియన్స్ ని మేమే చెడగొట్టాం.. హాట్ టాపిక్ గా మారిన దిల్ రాజు కామెంట్స్

నిర్మాత దిల్‌ రాజు ‘రేవు’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇందులో ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి మాట్లాడారు.' సినిమా రిలీజ్ అయ్యాక నాలుగు వారాలు ఆగండి, ఆ తర్వాత ఓటీటీలోకి వ‌స్తుంది. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని ఆడియన్స్ ను మేమే చెడగొట్టాం' అని అన్నారు.

Dil Raju : ఆడియన్స్ ని మేమే చెడగొట్టాం.. హాట్ టాపిక్ గా మారిన దిల్ రాజు కామెంట్స్
New Update

Producer Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులకు ఓటీటీలు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా ‘రేవు’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమలో పాల్గొన్న దిల్‌ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు." ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అనేది అంత‌ సులభం కాదు.

ఒక్కప్పుడు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి అంటే ఇంకా ఏమేమి యాడ్‌ చేయాలని నేను కూడా ఆలోచించేవాడిని. నా వరకు అయితే ఆ పరిస్థితి లేదు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో కొత్త వారికి మాత్రం బిగ్‌ ఛాలెంజ్‌గా మారింది. సినిమా తీయ‌డం గొప్ప కాదు. ఆ సినిమాను చూడ‌డానికి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్‌ల వ‌ర‌కు తీసుకురావ‌డం ఇప్పుడు ఛాలెంజింగ్‌గా మారింది. ‘రేవు’ సినిమా సాంగ్స్ కానీ ట్రైల‌ర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.



Also Read : పవర్ ఫ్యాక్డ్ యాక్షన్ తో ‘ది గోట్’ ట్రైలర్.. తండ్రీ,కొడుకులుగా అదరగొట్టిన దళపతి విజయ్

మేము తీసిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాలు విడుద‌లైన చాలా రోజుల త‌ర్వాత మౌత్ టాక్ ద్వారా హిట్ అందుకున్నాయి. అదే స‌మయంలో రివ్యూలు కూడా పాజిటివ్‌గా వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల‌ను చెడగొట్టిందే మేము. సినిమా విడుదలయ్యాక నాలుగు వారాలు ఆగండి ఆ తర్వాత ఓటీటీలోకి వ‌స్తుంది.. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని మేమే చెడగొట్టాం. కాబ‌ట్టి రేవు లాంటి సినిమాల‌కి మ‌న స‌పోర్ట్ ఉండాలి" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో దిల్ రాజు వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

#producer-dil-raju
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe