Bunny Vas : త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత బన్నీ వాస్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. 'ఆయ్' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ఈ మూవీని కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్‌తో తీయబోతున్నారని చెప్పారు.

Bunny Vas : త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!
New Update

Producer Bunny Vas Update On Trivikram - Allu Arjun Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో నాలుగో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు మంచి కమర్షియల్ విజయాలు సాధించాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు బాక్సాఫీస్ హిట్లుగా నిలిస్తే.. 'అల వైకుంఠపురములో' సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. కాగా ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

కానీ ఇటీవల మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసిన 'గుంటూరు కారం' రిజల్ట్ తేడా కొట్టడంతో బన్నీ.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడని' ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే రూమర్స్ ఇండస్ట్రీలో తెగ హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత బన్నీ వాస్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా 'ఆయ్' మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నిర్మాత బన్నీ వాసు అల్లు అర్జున్ తర్వాత సినిమా గురించి మాట్లాడారు.

Also Read : అంజలితో ఆ సీన్ నిజంగానే చేశా : యాక్టర్ శ్రీతేజ

'పుష్ప 2'తర్వాత బన్నీ త్రివిక్రమ్‌తో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని, ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏకంగా ఏడాదిన్నర సమయం పడుతుందని అన్నారు. అంతేకాకుండా కనివినీ ఎరుగని రీతిలో దేశంలో భారీ బడ్జెట్‌తో దీన్ని తీయబోతున్నారని చెప్పారు. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, బన్నీతో గురూజీ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది.

#allu-arjun-trivikram-movie #producer-bunny-vas
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe