YouTube : మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న యూట్యూబ్..కొద్దిసేపు నిలిచిన సేవలు! ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు కూడా డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడ్డారు. By Bhavana 23 Jul 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి YouTube - Microsoft : ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం కలిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ సర్వీసులు (YouTube) కూడా డౌన్ అయ్యాయి. చాలా మంది యూజర్లు యాప్, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు పడ్డారు. డౌన్ డిటెక్టర్ (Down Detector) ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి యూట్యూబ్‌లో సమస్యలు ఎదురైనట్లు సమాచారం. 33శాతం మంది యూజర్లు వీడియోలను అప్‌లోడ్ చేయడంలో ఇబ్బందులుపడ్డట్లుగా సమాచారం. 23శాతం మంది వెబ్‌సైట్ కారణంగా తిప్పలుపడినట్లు ఫిర్యాదు చేశారు. భారత్ (India) తో పాటు పలు దేశాల్లోనూ యూట్యూబ్‌లో అంతరాయం ఏర్పడింది. చాలామంది నెటిజన్లు యూట్యూబ్ సాంకేతిక సమస్యపై సోషల్ మీడియా (Social Media) వేదికగా స్పందించారు. కొంతమంది ఎలాంటి సమస్య లేకుండా యాక్సెస్ చేయగలుగుతున్నామని వివరించారు. అప్‌లోడ్ సమయంలో ఇబ్బందులుపడ్డట్లుగా ట్విటర్ వేదికగా పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలో #YouTubeDown అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. సాంకేతిక సమస్యపై యూట్యూబ్ అధికారిక ఎక్స్ వేదిక స్పందించింది. సమస్యను గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపింది. సమస్య ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పింది. Also read: ఆస్ట్రేలియాలో ఘోరం..రైలు ఢీకొని భారతీయ టెకీ..కుమార్తె మృతి! #youtube #microsoft #down-detector మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి