Human Trafficking: పట్టిపీడిస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ భూతం.. పది రాష్ట్రాల్లో NIA సోదాలు..

హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నివారించేందుకు దేశంలోని పది రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోదాలు చేపట్టారు. 8 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే జమ్మూలోని మయన్మార్‌కు చెందిన ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
ISIS Terror Conspiracy Case: కర్నాటక, మహారాష్ట్రలో NIA ఏకకాలంలో దాడులు..13 మంది అరెస్ట్..!!

ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి హ్యుమన్ ట్రాఫికింగ్. మనుషుల్ని అక్రమంగా వివిధ దేశాలకు తరలిస్తున్న కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ భూతాన్ని అంతం చేసేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇవి ఆగడం లేదు. ఎక్కడో ఓ చోట ఇలాంటి కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనదేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక నిర్ణయం తీసుకుంది. మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులకు సంబంధించి ఈరోజు సోదాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో ఈ తనిఖీలు జరగనున్నాయి. 8 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, అస్సాం, బెంగాల్, త్రిపుర, తమిళనాడు, హర్యానా, కశ్మీర్, పుదిచ్చేరి, రాజస్థాన్‌లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

Also Read: బిహార్‌లో 75 శాతానికి పెరగనున్న రిజర్వేషన్లు.. రేపే అసెంబ్లీలో బిల్లు..

ఇక జమ్మూలోని బతిండి అనే ప్రాంతంలో తెల్లవారుజామున రెండు గంటలకు జాఫర్ ఆలమ్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మయన్మార్‌కు చెందిన రోహింగ్య ముస్లీంగా గుర్తించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు, మయన్మార్ శరణార్థులు ఉన్న బస్తీల్లో ప్రస్తుతం అక్కడ ఈ సోదాలు జరుగుతున్నాయి. పాస్‌పోర్టు యాక్ట్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఘటనలతో లింకు ఉన్న కేసుల్లో ఈ తనిఖీలు చేపట్టారు.

Also Read: అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి..

Advertisment
తాజా కథనాలు