Pro Kabaddi League : తొడగొట్టిన బాలకృష్ణ..19 నుంచి ప్రో కబడ్డీ లీగ్‌

టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టారు. అయితే ఈసారి ఆయన తొడగొట్టింది రాజకీయ వేదిక మీద కాదు. ప్రోకబడ్డీ తెలుగు టైటాన్స్ జట్టుతో కలిసి. బాలకృష్ణ ప్రోకబడ్డీ లీగ్‌ 10కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Pro Kabaddi League : తొడగొట్టిన బాలకృష్ణ..19 నుంచి ప్రో కబడ్డీ లీగ్‌
New Update

Balakrishna : టాలీవుడ్(Tollywood) నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) తొడగొట్టారు. అయితే ఈసారి ఆయన తొడగొట్టింది రాజకీయ వేదిక మీద కాదు. ప్రో. కబడ్డీ తెలుగు టైటాన్స్(Pro Kabaddi Telugu Titans) జట్టుతో కలిసి. బాలకృష్ణ ప్రోకబడ్డీ లీగ్‌ 10కు బ్రాండ్‌ అంబాసిడర్‌(Brand Ambassador) గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం తెలుగు టైటాన్స్‌ కోచ్‌ శ్రీనివాస్‌రెడ్డి(Srinivas Reddy), టీం కెప్టెన్‌ పవన్ షెరావత్‌ బాలకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. గచ్చిబౌలి(Gachibowli) లోని ఇండోర్‌ స్టేడియంలో ప్రొకబడ్డీ లీగ్‌ -10 జనవరి 19 నుంచి ప్రారంభమవుతుంది.ఈ పోటీలో తెలుగు టైటాన్స్‌ తొలిమ్యాచ్‌ జరుగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు టైటాన్స్‌ కోచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీం కెప్టెన్‌ పవన్ షెరావత్‌ బాలకృష్ణను ఆయన నివాసంలో కలిసి తెలుగు టైటాన్స్ టీం జెర్సీని బాలకృష్ణకు అందజేశారు.

ఇది కూడా చదవండి :Big Brands : చిన్న పట్టణాల్లో పెద్ద బ్రాండ్స్.. రిటైల్ బిజినెస్ ఆట మారింది.. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు టైటాన్స్‌ లీగ్‌ టీం సభ్యులు విజయవంతంగా ఆట ఆడాలని, ఈ లీగ్ లో జట్టు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. 19న జరిగే కబడ్డీ పోటీలకు అభిమానులంతా తరలి వచ్చి విజయ వంతం చేయాలని కోరారు. తెలుగు టైటాన్స్‌ జట్టుకు మద్దతుగా నిలువాలని ఆకాంక్షించారు. అభిమానుల మద్ధతుతో లీగ్ 10 లో విజయం సాధిస్తామని కెప్టెన్ పవన్ షెరావత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read :Gold Price: భారీగా తగ్గిన బంగారం..వెండి ధరలు!

అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కబడ్డీ ఆటను ఎంజాయ్ చేయడంతో పాటు తెలుగు టైటాన్స్ ను ప్రోత్సహించాలని, ఉద్వేగభరితమైన ఈ ఆట విజయం ప్రేక్షకుల ఆదరణ శక్తితో కూడుకున్నదని షెరావత్ అన్నారు. విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నామని ఆ దిశగా ప్రయాణిస్తామని ఆయన తెలిపారు.

#nandamuri-balakrishana #pro-kabaddi-league #telugu-titans
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe