Pro Kabaddi League : తొడగొట్టిన బాలకృష్ణ..19 నుంచి ప్రో కబడ్డీ లీగ్
టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తొడగొట్టారు. అయితే ఈసారి ఆయన తొడగొట్టింది రాజకీయ వేదిక మీద కాదు. ప్రోకబడ్డీ తెలుగు టైటాన్స్ జట్టుతో కలిసి. బాలకృష్ణ ప్రోకబడ్డీ లీగ్ 10కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.