Tillu 3 : రాధిక 3.O గా 'రౌడీ' హీరోయిన్.. సిద్దూ సెలక్షన్ నెక్స్ట్ లెవెల్ అంతే! 'టిల్లూ క్యూబ్' కోసం సిద్దూ మరో హాట్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 'టాక్సీ వాలా' మూవీ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ 'టిల్లు క్యూబ్'లో రాధిక 3.0గా కనిపించనుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే మేకర్స్ ఈ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. By Anil Kumar 09 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Priyanka Jawalkar As Radhika 3.o In Tillu Qube : టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్' మూవీతో భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. డీజే టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ లిల్లీ పాత్రతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి రాధికగా నటిస్తే.. ఈ సినిమాతో అందరూ ఆమె పేరును మర్చిపోయి, రాధిక అనే పిలుస్తున్నారు. ‘టిల్లు స్కేర్’లో లిల్లీగా అనుపమా పరమేశ్వరన్ నటించినా.. ఆమెను అందరూ రాధిక 2.0 అనే పిలుస్తున్నారు. ఇప్పుడు 'టిల్లూ క్యూబ్'లో కోసం సిద్దూ మరో హాట్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్లు తాజా సమాచారం బయటికొచ్చింది.ఆ హాట్ హీరోయిన్ మరెవరో కాదు మన రౌడీ హీరో విజయ దేవరకొండతో 'టాక్సీ వాలా' సినిమాలో నటించిన ప్రియాంక జవాల్కర్. 'టిల్లు స్కేర్'లో క్షణకాలం మెరిసిన ప్రియాంక జవాల్కర్.. ఇప్పుడు ‘టిల్లు క్యూబ్’లో రాధిక 3.0గా కనిపించనుందని ఇన్సైడ్ టాక్. Also Read : మనోజ్ కూతురి బారసాలలో కనిపించని మంచు విష్ణు.. గొడవలే కారణమా? ఇప్పటికే మేకర్స్ 'టిల్లు క్యూబ్' కోసం ఈ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే టిల్లు క్యూబ్ రిలీజ్ తర్వాత ప్రియాంక జవాల్కర్ కాస్త రాధిక 3.O గా మారిపోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. త్వరలోనే మేకర్స్ నుంచి దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. #siddu-jonnalagadda #priyanka-jawalkar #tllu-qube-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి